Breaking News

రోహిత్, విరాట్ కోహ్లి రిటైర్‌మెంట్!? .. బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు కీల‌క వ్యాఖ్య‌లు

Published on Sat, 08/23/2025 - 13:41

టీమిండియా దిగ్గ‌జాలు విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌లు ఆస్ట్రేలియా టూర్ త‌ర్వాత అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే టీ20లు, టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న  వీరిద్ద‌రూ కేవ‌లం వ‌న్డేల్లో మాత్ర‌మే కొన‌సాగుతున్నారు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 త‌ర్వాత రో-కో ద్వ‌యం ఇప్ప‌టివ‌ర‌కు భార‌త త‌ర‌పున ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు. అయితే వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్-2027 దృష్ట్యా వీరిద్దరి స్ధానాల్లో యువ ఆటగాళ్లను బీసీసీఐ సిద్దం చేయనుందని,  అక్టోబ‌ర్‌లో ఆసీస్‌తో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డేల సిరీసే ఆఖ‌రిద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 

తాజాగా ఈ సీనియర్ ద్వయం రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ (BCCI ) ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. అవ‌న్నీ వ‌ట్టి రూమర్సే అని అతడు కొట్టిపారేశారు. రోహిత్, కోహ్లి ఇద్దరూ వైట్ బాల్ క్రికెట్‌లోకి తిరిగొచ్చేందుకు తమ ట్రైనింగ్‌ను తిరిగి ప్రారంభించారు. కాగా రాజీవ్ శుక్లా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో శుక్లాను స‌చిన్ టెండూల్క‌ర్‌లాగానే రోహిత్‌, కోహ్లిలకు ప్ర‌త్యేకంగా ఫేర్‌వెల్ నిర్వ‌హిస్తారా ? అని హోస్ట్ ప్ర‌శ్నించాడు.

"రోహిత్, కోహ్లి ఇంకా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కాలేదు. వారిద్దరూ ఇంకా వన్డేలు ఆడుతున్నారు. వారు ప్రస్తుతం కేవలం రెండు ఫార్మాట్ల నుంచి మాత్రమే తప్పుకొన్నారు. మరో ఫార్మాట్‌లో ఆడుతున్నప్పుడు మీరెందుకు వారి ఫేర్‌వెల్ గురుంచి మాట్లాడుతున్నారు? వారి రిటైర్‌మెంట్ గురించి మీరంతా ఎందుకు ఆందోళ‌న చెందుతున్నారు?   బీసీసీఐకి ఒక పాలసీ ఉంటుంది. 

బీసీసీఐ ఎవ‌రిని కూడా రిటైర్‌మెంట్ ఇవ్వ‌మ‌ని అడ‌గ‌దు. వారే సొంతంగా త‌మ నిర్ణ‌యాలు తీసుకోవాలి. ప్లేయ‌ర్ తీసుకునే నిర్ణ‌యాన్ని మేము గౌర‌విస్తాము. ఆట‌గాళ్లు విష‌యంలో ఏ నిర్ణ‌యం తీసుకోవాలో మాకు తెలుసు. కానీ ఇదంతా ఇప్పుడు అన‌వ‌సరం.

విరాట్ కోహ్లి చాలా ఫిట్‌గా ఉన్నాడు. రోహిత్ శ‌ర్మ కూడా బాగా ఆడుతున్నాడు. కాబట్టి వారి ఫేర్‌వెల్‌ గురుంచి ఆలోచిండం ఆపయేండి" అని  శుక్లా  పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఆక్టోబర్‌లో భారత జట్టు ఆసీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌ ఆడనుంది.
చదవండి: Asia Cup 2025: 'ఆసియాక‌ప్ గెలిచేది ఆ జ‌ట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)