Breaking News

రోహిత్‌ అరుదైన ఘనత.. గేల్‌ ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు! తర్వాత సచినే

Published on Fri, 03/08/2024 - 13:32

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 154 బంతుల్లో తన 12వ టెస్టు సెంచరీ మార్కు అందుకున్నాడు. ఓవరాల్‌గా ఇది 48 అంతర్జాతీయ టెస్టు సెంచరీ కావడం విశేషం.

మొత్తంగా 162 బంతుల్లో 103 పరుగులు చేసిన హిట్‌మ్యాన్‌.. స్టోక్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా శుబ్‌మన్‌​ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 160 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన రోహిత్‌ శర్మ పలు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. 

రోహిత్‌ సాధించిన రికార్డులు ఇవే..
►అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. ఈ క్రమంలో భారత హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌(48) రికార్డును రోహిత్‌ సమం చేశాడు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌(100) తొలి స్దానంలో ఉండగా.. కోహ్లి(80) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు.

►అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఓపెనర్‌గా హిట్‌మ్యాన్‌ నిలిచాడు. రోహిత్‌కు ఇది ఓపెనర్‌గా 43వ సెంచరీ. ఈ క్రమంలో క్రిస్‌ గేల్‌(42) రోహిత్‌ అధిగమించాడు. ఈ లిస్ట్‌లో డేవిడ్‌ వార్నర్‌(49) అగ్రస్ధానంలో ఉన్నాడు.

►అదే విధంగా టెస్టుల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఓపెనర్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును రోహిత్‌ సమం చేశాడు. గవాస్కర్‌ ఓపెనర్‌గా ఇంగ్లండ్‌పై 4 సెంచరీలు చేయగా.. హిట్‌మ్యాన్‌ సైతం 4 సెంచరీలు చేశాడు.

►ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్‌ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు డబ్ల్యూటీసీ చరిత్రలో 9 సెంచరీలు సాధించాడు.

►30 ఏళ్ల వయస్సు తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా సచిన్‌ టెండూల్కర్‌(35) రి​కార్డును సైతం రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. 30 ఏళ్ల వయస్సు తర్వాత సచిన్‌ 35 సెంచరీలు చేయగా.. రోహిత్‌ సైతం 35 సెంచరీలు చేశాడు. మరోసెంచరీ చేస్తే సచిన్‌ రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేస్తాడు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి