Breaking News

చాలా బాధ‌ప‌డ్డాను.. క్రికెట్ వదిలేయాలనుకున్నా: రోహిత్‌ శర్మ

Published on Mon, 12/22/2025 - 10:53

నవంబర్ 19, 2023.. భారత క్రికెట్ అభిమానులకు గుండె కోత మిగిల్చిన రోజు. అదే రోజు రాత్రి కోట్లాది భారతీయుల కలలు, ఆశలు ఒక్క ఓటమితో అవిరయ్యాయి. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా.. అనూహ్యంగా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. అయితే ఆ ఓటమిని ఇప్పటికీ అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రోహిత్ అప్పటి చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు. ఆ ఓటమి తనను ఎంతగానో కృంగదీసిందని హిట్‌మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు.

"2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత నేను మానసికంగా కుంగిపోయాను. ఇకపై క్రికెట్ ఆడకూడదని, వెంటనే తప్పుకోవాలని అనుకున్నాను.  ఎందుకంటే ఆ టోర్నీ కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను. ఇక సాధించడానికి ఏమి మిగిల లేదన్పించింది. 2022లో కెప్టెన్సీ చేపట్టినప్పటి నుండి ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.

అటువంటిది ట్రోఫీకి అడుగుదూరంలో నిలిచిపోవడం నేను జీర్ణించుకోలేకపోయాను. మళ్లీ నాకు నేనే ధైర్యం చెప్పుకొని నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటకు వచ్చాను. మరోసారి లక్ష్యంగా దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాను. జీవితం అక్కడితో అగిపోదు.. కొత్తగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్నాను. ఆ పట్టుదలే 2024 టీ20 ప్రపంచ కప్ విజేతగా మమ్మల్ని నిలబెట్టింది" అని మాస్టర్స్ యూనియన్ కార్యక్రమంలో రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL: చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్‌గా 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)