Breaking News

రోహిత్‌ శర్మ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన ప్రజ్ఞాన్‌ ఓజా

Published on Tue, 03/28/2023 - 17:24

టీమిండియా మాజీ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా.. భారత క్రికెట్‌ జట్టు ప్రస్తుత సారధి రోహిత్‌ శర్మకు సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కలిసి ఆడిన ఈ ఇద్దరు చాలా సన్నిహితంగా మెలిగేవారు. ఒకరి కష్టాలు ఒకరు షేర్‌ చేసుకోవడంతో వీరి స్నేహ బంధం మరింత బలపడింది. సెటిల్‌ అవ్వకముందు హిట్‌మ్యాన్‌ కష్టాలను దగ్గరి నుండి చూసిన ఓజా.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రోహిత్‌.. ఒకానొక సందర్భంలో (అండర్‌-15 ఆడే రోజుల్లో) కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు డెలివరీ చేసేవాడని ఓజా తెలిపాడు. అక్కడి నుంచి మొదలైన హిట్‌మ్యాన్‌ జర్నీ ఇవాళ ఎక్కడుందో చూస్తుంటే చాలా గర్వంగా ఉందని తెలిపిన ఓజా.. టీమిండియా కెప్టెన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్‌ యువతరానికి ఆదర్శప్రాయుడని కొనియాడిన ఓజా.. ఫైవ్‌ టైమ్‌ ఐపీఎల్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ను ఆకాశానికెత్తాడు. ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. 

ఇదిలా ఉంటే, రోహిత్‌ శర్మ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌-2023 సీజన్‌ సన్నాహకాల్లో బిజీగా ఉండగా, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ అయిన ఓజా తన పనుల్లో తాను బిజీగా ఉన్నాడు. గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న ముంబై ఇండియన్స్‌ను ఎలాగైనా గాడిలో పెట్టాలని భావిస్తున్న హిట్‌మ్యాన్‌, తదనుగుణంగా వ్యూహాలు రచించడంలో నిమగ్నమై ఉన్నాడు. ఏప్రిల్‌ 2న ఆర్సీబీతో జరిగే మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌-2023 సీజన్‌ జర్నీ మొదలవుతోంది. 
 

Videos

అటు పార్టీలోనూ...ఇటు ప్రభుత్వంలోనూ డాడీని డమ్మీని చేస్తున్న లోకేశ్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి ఓవరాక్షన్

నమ్మించి నట్టేట ముంచారు చంద్రబాబుపై మహిళలు ఫైర్

ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేతల హౌస్ అరెస్టులు

Rain Alert: వారం రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు

Charminar Gulzar House: ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి

డోర్ లాక్ పడి..నలుగురు చిన్నారులు మృతి

Nagarjuna Yadav: రైతులపై పగ.. పెట్టుబడి సాయం జీరో, రైతు భరోసా జీరో

KSR Paper Analysis: ఈరోజు ముఖ్యాంశాలు

TDP నేతల చేతిలో దాడికి గురై.. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జేమ్స్

Photos

+5

కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు

+5

కాజల్‌ బర్త్‌డే స్పెషల్‌.. ఆ సినిమాతోనే స్టార్‌డమ్‌ (ఫొటోలు)

+5

23వ 'జీ సినీ అవార్డ్స్'.. ముంబైలో మెరిసిన స్టార్‌ హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

విజయవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (ఫొటోలు)

+5

ట్యాంక్‌ బండ్‌పై అట్టహాసంగా ప్రారంభమైన సండే ఫండే వేడుకలు (ఫొటోలు)

+5

వరంగల్ : సరస్వతీ పుష్కరాలకు పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)