Breaking News

ఎందుకలా నెట్టేస్తున్నావు?.. రోహిత్‌పై విమర్శలు

Published on Sat, 07/06/2024 - 15:58

ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న చిరకాల కోరిక నెరవేరడంతో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2024 ట్రోఫీని ముద్దాడిన క్షణాలను తలచుకుంటూ హిట్‌మ్యాన్‌ కుటుంబం సైతం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది.

ఇలాంటి సంతోషకర సమయంలో కొద్ది మంది నెటిజన్లు మాత్రం రోహిత్‌ శర్మపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తల్లిదండ్రులంటే అతడికి ఏమాత్రం గౌరవం లేదంటూ ఇష్టారీతిన ట్రోల్‌ చేస్తున్నారు. మరికొంత మందేమో ఈ విషయంలో విరాట్‌ కోహ్లి పేరును ప్రస్తావిస్తూ అతడినీ విమర్శిస్తున్నారు.

అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో భారత్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. లీగ్‌ దశ నుంచి ఫైనల్‌ వరకు అజేయంగా నిలిచిన రోహిత్‌ సేన.. ఆఖరి పోరులో సౌతాఫ్రికాను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

తద్వారా భారత్‌ ఖాతాలో పదమూడేళ్ల తర్వాత మరో వరల్డ్‌కప్‌ ట్రోఫీ చేరింది. టైటిళ్ల సంఖ్య నాలుగైంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ముంబైకి పయనమైన రోహిత్‌ సేన బస్‌ పెరేడ్‌లో పాల్గొంది.

అదే విధంగా.. ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో అభిమానులకు అభివాదం చేస్తూ చిరస్మణీయ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంది. ఇదిలా ఉంటే.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తల్లి పూర్ణిమ శర్మ సైతం ఈ ఆనందోత్సవంలో భాగమయ్యారు.

ఈ క్రమంలో కుమారుడిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన ఆమె.. ఆప్యాయంగా ముద్దుల వర్షం కురిపించారు. అయితే, అందుకు ప్రతిగా రోహిత్‌ శర్మ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ట్రోలింగ్‌కు కారణమయ్యాయి.

‘‘ఇక చాల్లే.. అందరూ చూస్తున్నారమ్మా’’ అన్నట్లుగా బిడియం ప్రదర్శించిన రోహిత్‌.. కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఈ క్రమంలో కొంతమంది రోహిత్‌ను టార్గెట్‌ చేశారు. ‘‘భార్య, కూతురితో ఉన్నంత అనుబంధం తల్లితో లేదా? ఆమె అంత ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటూ ఉంటే ఇలా చేయడం అస్సలు బాలేదు’’ అని విమర్శిస్తున్నారు.

ఇక మరికొంత మందేమో.. ‘‘రోహిత్‌ కనీసం తన తల్లిదండ్రులనైనా ఇక్కడిదాకా తీసుకువచ్చాడు. కోహ్లి అయితే భార్యను తప్ప తల్లిని ఏనాడూ ఎక్కడికీ తీసుకురాడు’’ అని ట్రోల్‌ చేస్తున్నారు.

అప్పుడే తన నిర్ణయం చెప్పాడు
ఇదిలా ఉంటే.. రోహిత్‌ శర్మ సాధించిన విజయం పట్ల అతడి తల్లి పూర్ణిమ శర్మ స్పందించారు. ‘‘ఇలాంటి ఒకరోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు.

వరల్డ్‌కప్‌ ఆడేందుకు వెళ్లే కంటే ముందు రోహిత్‌ మమ్మల్ని కలవడానికి వచ్చాడు. అప్పుడే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలకాలన్న తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

గెలిచినా.. ఓడినా తన ఆలోచనలో మార్పు ఉండదని చెప్పాడు. అప్పుడు నేను గెలవడానికి ప్రయత్నించు అని మాత్రమే చెప్పగలిగాను. నిజానికి ఇప్పుడు కూడా నా ఆరోగ్యం అంతగా బాలేదు. అయితే, డాక్టర్‌ అప్పాయింట్‌మెంట్‌ మిస్‌ చేసుకుని మరీ ఇక్కడికి వచ్చాను’’ అని పుత్రోత్సాహంతో పొంగిపోయారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)