Breaking News

టీమిండియాకు గుడ్‌ న్యూస్‌

Published on Mon, 06/08/2026 - 20:26

త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందుతుంది. స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్ పరీక్షల కోసం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2026 సందర్భంగా రోహిత్‌ హామ్‌స్ట్రింగ్ గాయానికి గురైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

తాజాగా ఆ పునరావాసాన్ని పూర్తి చేసుకొని CoEకు చేరాడు. అక్కడ రోహిత్‌కు మూడు రోజుల పాటు ఫిట్‌నెస్ పరీక్షలు, నెట్ సెషన్లు, బ్యాటింగ్ ప్రాక్టీస్ నిర్వహించనున్నారు. ఇందులో ఫ్లడ్‌లైట్ల కింద ప్రత్యేక బ్యాటింగ్ సెషన్ కూడా ఉండనుంది. ఈ పరీక్షల్లో విజయవంతంగా ఉత్తీర్ణత సాధిస్తేనే రోహిత్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్ ఆడేందుకు వైద్యుల అనుమతి లభించనుంది.

తొలుత జూన్ 9న జట్టుతో కలిసి వెళ్లాల్సి ఉన్న రోహిత్, ఇప్పుడు ఫిట్‌నెస్ క్లియరెన్స్ తర్వాత మాత్రమే జట్టులో చేరనున్నాడు. జూన్ 11న ధర్మశాలకు చేరుకుని, జూన్ 13న జరిగే తొలి వన్డేకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

39 ఏళ్ల రోహిత్ ఇటీవల ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, వన్డే ఫార్మాట్‌లో మాత్రం భారత జట్టుకు కీలక ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత అతని అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడుతోంది. 2027 ప్రపంచకప్ ఆడాలన్న లక్ష్యంతో రోహిత్‌ వన్డేల్లో కొనసాగుతున్నాడు. మిగతా ఫార్మాట్లకు ఇతను రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు