Breaking News

Champions Trophy 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌.. రోహిత్‌ను ఊరిస్తున్న భారీ రికార్డులు

Published on Thu, 02/20/2025 - 14:03

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్ ఇవాళ (ఫిబ్రవరి 20) తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.

  • ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ మరో 12 పరుగులు చేస్తే.. వన్డేల్లో 11,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా, ప్రపంచంలో 10వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. 2007 జూన్ 23న బెల్‌ఫాస్ట్ లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్‌.. ఇప్పటివరకు 268 మ్యాచ్‌లు ఆడి 10,988 పరుగులు చేశాడు.

వన్డేల్లో 11000  పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ (భారత్‌)- 18,426
కుమార్ సంగక్కర (శ్రీలంక)- 14,234
విరాట్ కోహ్లీ (భారత్)- 13,963
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)-13,704
సనత్ జయసూర్య (శ్రీలంక)- 13,430
మహేల జయవర్ధనే (శ్రీలంక)- 12,650
ఇంజమామ్-ఉల్-హక్ (పాకిస్థాన్)- 11,739
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 11,579
సౌరవ్ గంగూలీ (భారత్‌)- 11,363

  • ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 11000 పరుగులు పూర్తి చేస్తే మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసకుంటాడు. సహచరుడు విరాట్ కోహ్లీ తర్వాత ప్రపంచంలో అత్యంత వేగంగా 11000 వన్డే పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయ‌ర్‌గా రికార్డుకెక్కుతాడు. విరాట్‌ 222 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని తాకగా.. రోహిత్‌కు 260వ ఇన్నింగ్స్‌లో 11000 పరుగులు పూర్తి చేసే అవకాశం వచ్చింది.

వన్డేల్లో అత్యంత వేగంగా 11000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ (భారత్‌)- 222 ఇన్నింగ్స్‌లు
సచిన్ టెండూల్కర్ (భారత్‌)- 276
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 286
సౌరవ్ గంగూలీ (భారత్‌)- 288
జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 293  

  • నేటి మ్యాచ్‌లో రోహిత్‌ సెంచరీ చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడో భారతీయ ఆట‌గాడిగా, ప్రపంచంలో 10వ క్రికటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్‌ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 49 సెంచరీలు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు..
సచిన్ టెండూల్కర్ (భారత్‌)- 100
విరాట్ కోహ్లీ (భారత్‌)- 81
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 71
కుమార్ సంగక్కర (శ్రీలంక)- 63
జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)- 62
హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా)- 55
మహేల జయవర్ధనే (శ్రీలంక)- 54
బ్రియాన్ లారా (వెస్టిండీస్)- 53
జో రూట్ (ఇంగ్లాండ్)- 52
రోహిత్ శర్మ (భారత్‌)- 49

  • ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే.. కెప్టెన్‌గా రోహిత్‌ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరుతుంది. నేటి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధిస్తే..రోహిత్‌ ఖాతాలో 100 అంతర్జాతీయ విజయాలు నమోదవుతాయి. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో భారత కెప్టెన్‌గా రోహిత్‌ రికార్డుల్లోకెక్కుతాడు. రోహిత్‌ ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో 99 విజయాలు (137 మ్యాచ్‌ల్లో) సాధించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్లు..
ఎంఎస్ ధోనీ- 179
విరాట్ కోహ్లీ- 137
మొహమ్మద్ అజారుద్దీన్- 104
రోహిత్ శర్మ- 99
సౌరవ్ గంగూలీ- 97

  • నేటి మ్యాచ్‌లో రోహిత్‌ 14 సిక్స‌ర్లు కొడితే వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స్‌లు బాదిన ఆట‌గాడిగా చరిత్ర సృస్టిస్తాడు. ప్ర‌స్తుతం పాక్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది (398 మ్యాచ్‌ల్లో 351 సిక్సర్లు) పేరిట ఈ రికార్డు ఉంది.  రోహిత్ ఇప్పటివరకు 268 మ్యాచ్‌ల్లో 338 సిక్సర్లు బాదాడు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)