Breaking News

రోహిత్‌ కూడా విఫలం.. ట్రోఫీ గెలవలేదు కదా!

Published on Thu, 04/25/2024 - 16:02

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో ఆ జట్టుకు తెలుసునని.. అయితే, సమిష్టిగా రాణిస్తేనే అది సాధ్యపడుతుందని పేర్కొన్నాడు. 

అదే విధంగా.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తనను తాను ప్రమోట్‌ చేసుకుంటే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని సూచించాడు. అతడు గనుక బ్యాట్‌ ఝులిపించగలిగితే ఆత్మవిశ్వాసం పెరిగి.. బౌలర్‌గా, కెప్టెన్‌గానూ రాణించగలడని సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు.

కాగా ఐపీఎల్‌-2024లో రోహిత్‌ శర్మపై వేటు వేసిన ముంబై ఇండియన్స్‌.. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి వచ్చిన హార్దిక్‌ పాండ్యాకు పగ్గాలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఒత్తిడిలో చిత్తవుతున్న హార్దిక్‌ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లలో ముంబై ఓడింది.

ఆ తర్వాత గెలుపుబాట పట్టినా నిలకడ ఉండటం లేదు. రాజస్తాన్‌ రాయల్స్‌తో సోమవారం నాటి మ్యాచ్‌లోనూ పరాజయం పాలై ఎనిమిదింట ఐదో ఓటమిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ, వ్యక్తిగత ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్‌ హార్దిక్‌ పాండ్యాకు అండగా నిలిచాడు. గత రెండు- మూడు సీజన్లలో రోహిత్‌ శర్మ కూడా టైటిల్‌ సాధించలేకపోయాడని.. స్థాయికి తగ్గట్లు పరుగులు కూడా రాబట్టలేకపోయాడని పేర్కొన్నాడు. కాబట్టి హార్దిక్‌ పాండ్యా ఇవన్నీ పట్టించుకోకుండా.. ఆట మీద మాత్రమే దృష్టి పెట్టాలని సూచించాడు.

‘‘తన వ్యక్తిగత ప్రదర్శన గురించి హార్దిక్‌ పెద్దగా ఆందోళన చెందడం లేదనే అనుకుంటున్నా. కానీ తనపై ఉన్న భారీ అంచనాల కారణంగా ఒత్తిడికి లోనవుతున్నాడు. 

ఇక జట్టుగా ముంబై ఇండియన్స్‌ విషయానికొస్తే.. గతేడాది కూడా వాళ్ల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. వాళ్లకు ఇదేం కొత్త కాదు. ఆరంభంలో తడబడ్డా నిలదొక్కుకోగలరు. 

గతంలో కెప్టెన్‌గా ఉన్నపుడు రోహిత్‌ శర్మ కూడా పరుగులు చేయలేదు. గత రెండు- మూడేళ్లుగా టైటిల్‌ కూడా గెలవలేదు. ఇప్పటికీ మించి పోయిందేమీ లేదు. 

సమిష్టిగా రాణిస్తే ముందుకు వెళ్లగలరు. అయితే, హార్దిక్‌ పాండ్యా మాత్రం ఒత్తిడికి లోనుకాకూడదు. ముఖ్యంగా కెప్టెన్సీని భారంగా భావించకూడదు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తనను ప్రమోట్‌ చేసుకున్నా తప్పేం లేదు. 

కానీ లోయర్‌ ఆర్డర్లో వచ్చినా అతడు పరుగులు చేయడం లేదంటూ విమర్శించడం సరికాదు. తను కాస్త ముందుగా వస్తే బాగుంటుంది. బ్యాటింగ్‌ మెరుగుపడిందంటే కాన్ఫిడెన్స్‌ వస్తుంది. బౌలింగ్‌ కూడా చేయగలడు. కెప్టెన్‌గానూ తనను తాను నిరూపించుకోగలడు’’ అని సెహ్వాగ్‌ క్రిక్‌బజ్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)