రోహిత్ శ‌ర్మ స‌రికొత్త చ‌రిత్ర‌.. ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా

Published on Sat, 10/25/2025 - 21:09

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శతక్కొట్టాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లను హిట్‌మ్యాన్ ఉతికారేశాడు. మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లితో కలిసి భారత జట్టును వైట్ వాష్ నుంచి గట్టెక్కించాడు.

రోహిత్ ఓవరాల్‌గా 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కోహ్లి (74నాటౌట్‌; 81 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా టీమిండియా లక్ష్యాన్ని 38.3 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌, సిరీస్‌గా నిలిచిన రోహిత్ పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

రోహిత్‌ శర్మ సాధించిన రికార్డులు ఇవే..
👉సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాం‍డ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన విదేశీ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు సేనా దేశాల్లో 95 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రి​కార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్‌(92) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో 3 సిక్స్‌లు బాదిన రోహిత్.. గేల్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.

👉21వ శతాబ్దంలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ చేసిన అతి పెద్ద వయష్కుడిగా రోహిత్ నిలిచాడు.38 ఏళ్ల 178 రోజులు వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర(37 సంవత్సరాలు, 132 రోజులు) పేరిట ఉండేది.

👉వన్డే చరిత్రలో లేటు వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న భారత ఆటగాడిగా  రోహిత్ నిలిచాడు

👉ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు (6) చేసిన విదేశీ బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి (5), కుమార సంగక్కర (5)లను హిట్‌మ్యాన్‌ అధిగమించాడు. 

👉ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు.
చదవండి: థాంక్యూ ఆస్ట్రేలియా.. ఇదే మా చివరి మ్యాచ్‌!? రోహిత్‌, కోహ్లి ఎమోషనల్
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)