Breaking News

రిటైర్మెంట్ ఊహాగానాల‌పై రోహిత్ తొలి స్పంద‌న‌!

Published on Sat, 07/18/2026 - 21:34

టీమిండియా సీనియ‌ర్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ త‌న రిటైర్మెంట్‌పై వ‌స్తున్న ఊహాగానాల‌పై తొలిసారి స్పందించాడు. రోహిత్ రిటైర్మెంట్‌కు సంబంధించి వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వ‌మని బీసీసీఐ కార్య‌ద‌ర్శి దేవ‌జిత్ సైకియా పేర్కొన్నారు. టీమిండియా భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల్లో జ‌ట్టులో రోహిత్ శ‌ర్మ ఉంటాడ‌ని సైకియా అభిప్రాయ‌ప‌డ్డారు. 

ఈ నేప‌థ్యంలో లార్డ్స్ వేదిక‌గా రేపు జ‌ర‌గ‌నున్న చివ‌రి వ‌న్డే కోసం భార‌త ఆట‌గాళ్లు ప్రాక్టీస్‌కు వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ భారత బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కోట‌క్‌తో సుదీర్ఘంగా చ‌ర్చించిన ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి.  వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ను ఒక వ్య‌క్తి వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. 

ఆ వీడియోలో సితాన్షు కోట‌క్‌తో రోహిత్ మాట్లాడుతూ..'బ‌య‌ట జ‌రుగుతున్న విష‌యాల‌తో మన‌కు సంబంధం లేదు. అవ‌న్నీ పట్టించుకోవ‌ద్దు' అని పేర్కొన‌డం వినిపించింది. దీంతో అస‌లు టీమిండియాలో రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్‌కు సంబంధించి ఇంట‌ర్న‌ల్ చ‌ర్చ‌లు కూడా జ‌ర‌గ‌లేద‌ని దీన్నిబ‌ట్టి స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఇక శుక్రవారం రోహిత్‌ వన్డే కెరీర్‌పై సైకియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘రోహిత్‌ కెరీర్‌కు సంబంధించి ఏవేవో వార్తలు వస్తున్నాయి. ఆదివారం లార్డ్స్‌లో రోహిత్‌ చివరి వన్డే మ్యాచ్‌ ఆడబోతున్నాడనే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదు. భారత వన్డే జట్టులో రోహిత్‌ కీలక సభ్యుడు. జట్టు భవిష్యత్తు ప్రణాళికల్లో అతడు భాగం. లార్డ్స్‌ వన్డే అతడికి చివరి మ్యాచ్‌ కాదు’ అని సైకియా వెల్లడించాడు. 

సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అజిత్‌ అగార్కర్, ప్రధాన కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రోహిత్‌ వన్డే కెరీర్‌కు రిటైర్మెంట్‌ వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లు అయింది. ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌లో రోహిత్ ఆడిన రెండు వ‌న్డేలు క‌లిపి కేవ‌లం 37 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. అంత‌క‌ముందు అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో రోహిత్ వ‌రుస‌గా 16, 48, 79 ప‌రుగులు చేశాడు. తాజాగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో వ‌రుస వైఫ‌ల్యాలతో రోహిత్ రిటైర్మెంట్ వార్త‌లు తెర‌మీదకు వ‌చ్చాయి.

 

చదవండి: సిరీస్ విజ‌యంపై గురి.. లార్డ్స్‌లో టీమిండియాకు ఘన చరిత్ర!

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)