Breaking News

'గుడ్డిగా నమ్మడమేనా.. సొంత నిర్ణయం లేదా!'

Published on Tue, 04/18/2023 - 22:40

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పట్టు బిగించింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ చేధనలో తడబడుతోంది. 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే రివ్యూ విషయంలో ఇషాన్‌ కిషన్‌ను గుడ్డిగా నమ్మి చేతులు కాల్చుకున్నాడు రోహిత్‌ శర్మ.

ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్‌లో గ్రీన్‌ వేసిన మూడో బంతి లెగ్‌సైడ్‌ వెళ్లింది. క్లియర్‌గా వైడ్‌ అని తెలుస్తున్నప్పటికి ఇషాన్‌ ఔట్‌ అంటూ అప్పీల్‌ చేశాడు. ఫీల్డ్‌ అంపైర్‌ వైడ్‌ సిగ్నల్‌ ఇచ్చినప్పటికి ఇషాన్‌ మాత్రం తనకు సౌండ్‌ వినిపించిందని.. కచ్చితంగా ఔట్‌ అంటూ బలంగా పేర్కొన్నాడు. అయితే రోహిత్‌కు వైడ్‌ అని తెలుస్తున్నప్పటికి ఇషాన్‌పై నమ్మకంతో రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్ఝ్‌లో బంతి ఎక్కడ బ్యాట్‌కు తగలకపోగా.. దూరంగా వెళుతున్నట్లు క్లియర్‌గా కనిపించింది. దీంతో ముంబై రివ్యూ కోల్పోయింది.

అంతే ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అభిమానులు ట్రోల్‌ చేశారు. ''ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీకంటూ సొంత నిర్ణయం లేదా''.. ''అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఎన్నోసార్లు ఇతరుల మీద ఆధారపడి చేతులు కాల్చుకున్నావు.. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అదే పరిస్థితి''.. ''క్లియర్‌ వైడ్‌ అని నీకు తెలిసినప్పటికి అనవసరంగా రివ్యూకు వెళ్లావు.. కెప్టెన్‌గా ఇదేనా నీ అనుభవం'' అంటూ కామెంట్లు చేశారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)