Breaking News

చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. సచిన్‌ రికార్డు బద్దలు

Published on Thu, 02/20/2025 - 19:45

అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు. వన్డేల్లో అత్యంతవేగంగా 11000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ ఫీట్‌ను చేరుకోవడానికి రోహిత్‌కు 261 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.

ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ ఈ రికార్డును 276 ఇన్నింగ్స్‌లలో సాధించాడు. తాజా మ్యాచ్‌తో లిటల్‌మాస్టర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో రన్-మెషీన్ విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉన్నాడు. కోహ్లి 2019లో కేవలం 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.

రోహిత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌..
కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి రెండు ఓవర్లలో కాస్త ఆచితూచి ఆడిన రోహిత్‌.. మూడో ఓవర్‌ నుంచి బౌండరీల మోత మొదలు పెట్టాడు.  కేవలం 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేసి రోహిత్‌ శర్మ ఔటయ్యాడు. టాస్కిన్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి హిట్‌మ్యాన్‌ తన వికెట్‌ను కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది.

బంగ్లా బ్యాటర్లలో తౌహిద్‌ హ్రిదయ్‌(118 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 100) విరోచిత సెంచరీతో చెలరేగగా.. జాకర్ అలీ(68) ఆర్ధ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఫైవ్ వికెట్ హాల్‌తో మెరిశాడు. తన 10 ఓవర్ల కోటాలో షమీ 53 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు.

వ‌న్డేల్లో అత్యంత వేగంగా 11000 ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

1 - విరాట్ కోహ్లి: 222 ఇన్నింగ్స్‌లు

2 - రోహిత్ శర్మ: 261 ఇన్నింగ్స్

3 - సచిన్ టెండూల్కర్: 276 ఇన్నింగ్స్

4 - రికీ పాంటింగ్: 286 ఇన్నింగ్స్‌లు

5 - సౌరవ్ గంగూలీ: 288 ఇన్నింగ్స్
చదవండి: Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి..

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)