Breaking News

ఆ మాత్రం తెలియదా?.. అతడికి నేనేం చెప్పగలను: రోహిత్‌ శర్మ

Published on Tue, 12/31/2024 - 13:53

భారీ అంచనాలతో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌(Rishabh Pant) పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border- Gavaskar Trophy)లో వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకుంది. ఆసీస్‌తో ఇప్పటి వరకు పెర్త్‌, అడిలైడ్‌, బ్రిస్బేన్‌, మెల్‌బోర్న్‌ వేదికలుగా జరిగిన నాలుగు టెస్టుల్లోనూ పంత్‌ బ్యాట్‌ ఝులిపించలేకపోయాడు.

ఒక్క హాఫ్‌ సెంచరీ లేదు
ఈ నాలుగు టెస్టుల్లో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పంత్‌ చేసిన స్కోర్లు వరుసగా.. 37, 1, 21, 28, 9, 28, 30. ముఖ్యంగా మెల్‌బోర్న్‌లో సోమవారం ముగిసిన బాక్సింగ్‌ డే టెస్టులో పంత్‌ కాసేపు పోరాడి ఉంటే.. ఫలితం వేరేలా ఉండేది. కానీ..  వైఫల్యాల నుంచి తాను గుణపాఠాలు నేర్చుకోనని అతడు మరోసారి నిరూపించాడు.

పరిస్థితులకు తగినట్లుగా ఆడకుండా తనకు నచ్చిన షాట్లనే ఆడతానని పంత్‌ పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 191/5తో కష్టాల్లో ఉన్న సమయంలో స్కూప్‌ షాట్‌ ఆడబోయి డీప్‌ థర్డ్‌మాన్‌ వద్ద పంత్‌ క్యాచ్‌ ఇచ్చాడు.

స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్‌
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌.. రిషభ్‌ పంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ‘స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్‌’ అంటూ అతడికి టీమిండియా డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లే అర్హతే లేదంటూ ఘాటుగా విమర్శించాడు.

నిర్లక్ష్యపు షాట్లతో భారీ మూల్యం
గతంలో ఇవే షాట్లు తనకు పరుగులు అందించినా... ఇది సమయం కాదని సన్నీ విమర్శించాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లోనూ పంత్‌ అదే పని చేయడం గమనార్హం. జైస్వాల్‌తో 88 పరుగుల భాగస్వామ్యంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా ఓటమి నుంచి తప్పించుకునే స్థితిలో ఉన్న దశలో.. పంత్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. 

ట్రవిస్‌ హెడ్‌ బౌలింగ్‌లో భారీ పుల్‌ షాట్‌ ఆడి లాంగాన్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాతే భారత్‌ ఓటమికి బాటలు పడి.. 184 పరుగుల భారీ తేడాతో పరాజయం ఎదురైంది.

అతడికి నేనేం చెప్పగలను
ఈ నేపథ్యంలో రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ శైలిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌ టెస్టులో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma)కు.. పంత్‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘తనకేం ఏం కావాలో పంత్‌ అర్థం చేసుకోగలగాలి.

అతడికి మేము చెప్పడం కంటే.. తనకు తానుగా తన తప్పేమిటో తెలుసుకుంటే బాగుంటుంది. అలా అయితే, సరైన దారిలో నడిచేందుకు వీలు ఉంటుంది. గతంలో ఇలాంటి షాట్లతో అతడు ఎన్నోసార్లు విజయాలు అందించాడు.

కాబట్టి కెప్టెన్‌గా తన పట్ల నా స్పందన మిశ్రమంగానే ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రయోగాలు విఫలమవుతాయి. అలాంటి సమయంలో ఇలాంటి విమర్శలు వస్తాయి. అయితే, కెప్టెన్‌గా ఈ విషయంలో నేను అతడికి చెప్పాల్సింది ఏమీలేదు.

ఆ మాత్రం తెలిసి ఉండాలి కదా!
ఎలాంటి పరిస్థితుల్లో రిస్క్‌ తీసుకువచ్చో ఆటగాడికి తెలిసి ఉండాలి. మన చర్యల వల్ల ప్రత్యర్థికి అవకాశం దొరుకుతుందని భావిస్తే ఆచితూచి ఆడటమే ఉత్తమం. తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకుని ముందుకు సాగాలి. 

జట్టు తన నుంచి ఏం ఆశిస్తుందో పంత్‌కు తెలుసు’’ అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉంది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన ఐదో టెస్టు జనవరి 3-7 మధ్య సిడ్నీలో జరుగనుంది.

చదవండి: టెస్టుల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన అఫ్గనిస్తాన్‌.. సరికొత్త చరిత్ర.. కానీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)