నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
రోహిత్ శర్మ హ్యాట్రిక్.. వీడియో వైరల్
Published on Sat, 06/20/2026 - 16:02
చెన్నై వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో వన్డే ఓ అద్భుతమైన రికార్డుకు వేదికైంది. టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ ప్రసిద్ద్ కృష్ణ కలిసి అరుదైన ఫీట్‌ను సాధించారు.
వీరిద్దరి కాంబినేషన్లో ఓ యూనిక్ హ్యాట్రిక్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌కు ప్రసిద్ద్ కృష్ణ ఆరంభంలోనే చుక్కలు చూపించాడు. తన సంచలన బౌలింగ్‌తో అఫ్గాన్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.
ప్రసిద్ద్ వేసిన తన స్పెల్ మొదటి బంతికే గుర్బాజ్ అవుట్ అయ్యాడు. ఆఫ్ స్టంప్ వెలుపల పడిన బంతిని గుర్బాజ్ ఆఫ్‌సైడ్ ఆడగా, అది ఎడ్జ్ తీసుకుని ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత 6 ఓవర్లో ప్రసిద్ధ్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని రహ్మత్ షా లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు.
కానీ లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని మళ్లీ స్లిప్స్‌లో ఉన్న హిట్‌మ్యాన్ అందుకున్నాడు. అంతేకాకుండా 8వ ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ డ్రైవ్ చేయడానికి ప్రయత్నించి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్‌కే క్యాచ్ ఇచ్చాడు. దీంతో రోహిత్ క్యాచ్‌ల హ్యాట్రిక్ పూర్తి అయింది.
ఒక వన్డే మ్యాచ్‌లో ఒకే బౌలర్ బౌలింగ్‌లో మూడు క్యాచ్‌లు పట్టిన మూడవ భారత ఫీల్డర్‌గా రోహిత్ నిలిచాడు. అతడి కంటే ముందు వి.వి.ఎస్. లక్ష్మణ్ (2004లో జింబాబ్వేపై ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో), శిఖర్ ధావన్ (2018లో బంగ్లాదేశ్‌పై జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో) ఈ ఫీట్ సాధించారు.
చదవండి: MLC 2026: ఐపీఎల్లో డ్రింక్స్ బాయ్.. కట్ చేస్తే! అక్కడ కేవలం 25 బంతుల్లోనే
Identical setups, identical results 🔄
Prasidh Krishna 🤝 Rohit Sharma 😎
Updates ▶️ https://t.co/kHgF4bqTg3#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/Bf2YPIA59l— BCCI (@BCCI) June 20, 2026
Tags : 1