Breaking News

న్యూజిలాండ్‌ బ్యాటర్‌ ఊచకోత.. పాక్‌కు పరాభవం

Published on Tue, 04/25/2023 - 07:18

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌కు పరాభవం ఎదురైంది. స్వదేశంలో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి కూడా ఆ జట్టు సిరీస్‌ గెలవలేకపోయింది. నిన్న (ఏప్రిల్‌ 24) జరిగిన ఐదో టీ20లో పర్యాటక జట్టు గెలవడం ద్వారా 2-2తో సిరీస్‌ సమమైంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు పాక్‌ గెలువగా.. మూడు, ఐదు మ్యాచ్‌లలో కివీస్‌ నెగ్గింది. నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది.

చాప్‌మన్‌ ఊచకోత.. రిజ్వాన్‌ మెరుపులు వృధా
రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. మహ్మద్‌ రిజ్వాన్‌ (62 బంతుల్లో 98 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇఫ్తికార్‌ అహ్మద్‌ (22 బంతుల్లో 36), ఇమాద్‌ వసీం (14 బంతుల్లో 31) ఓ మోస్తరుగా రాణించారు. కివీస్‌ బౌలర్లలో టిక్నర్‌ 3, సోధి ఓ వికెట్‌ పడగొట్టారు.

భారీ లక్ష్య ఛేదనలో మార్క్‌ చాప్‌మన్‌ (57 బంతుల్లో 104 నాటౌట్‌; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగురవేసింది. చాప్‌మన్‌కు జతగా నీషమ్‌ (45 నాటౌట్‌) రాణించాడు. పాక్‌ బౌలర్లలోషాహీన్‌ అఫ్రిది, ఇమాద్‌ వసీం చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్‌ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన చాప్‌మన్‌కు (34, 65*, 16*, 71*, 104*) మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డుతో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు కూడా లభించింది. ఇరు జట్ల మధ్య ఏప్రిల్‌ 27 నుంచి 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)