ఫిఫా నుంచి జట్టు నిష్క్రమణ.. స్టార్ ఫుట్‌బాల‌ర్ వీడ్కోలు

Published on Sat, 07/04/2026 - 00:17

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ నుంచి అల్జీరియా నిష్క్ర‌మించిన త‌ర్వాత ఆ జ‌ట్టు స్టార్ ఫుట్‌బాల‌ర్ రియాద్ మ‌హ్రెజ్ అంత‌ర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఫిఫా టోర్నీలో  రౌండ్ ఆఫ్-32లో స్విట్జ‌ర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అల్జీరియా ఓట‌మి పాలైంది. ఈ నేపథ్యంలో ఆట‌కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు రియాద్ మెహ్రెజ్ తెలిపాడు. 

అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌లో అల్జీరియా త‌ర‌ఫున 119 మ్యాచ్‌లాడిన 35 ఏళ్ల ఫార్వార్డ్ ప్లేయ‌ర్ రియాద్‌ మ‌హ్రెజ్ 40 గోల్స్ సాధించి జ‌ట్టు త‌ర‌ఫున అత్య‌ధిక గోల్స్ చేసిన రెండో ఆట‌గాడిగా చ‌రిత్ర‌కెక్కాడు. 2019లో ఆఫ్రికా క‌ప్ ఆఫ్ నేష‌న్స్ (ఆఫ్క‌న్‌) టైటిల్ అందించ‌డంలో రియాద్ మ‌హ్రెజ్‌ది కీల‌క‌పాత్ర‌. 

అయితే రియాద్ మ‌హ్రెజ్ అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు దూర‌మైనప్ప‌టికీ, సౌదీ ప్రో లీగ్ క్ల‌బ్ @అల్ అహ్లీ త‌ర‌ఫున ఫ్రొఫెష‌న‌ల్ క్ల‌బ్ కెరీర్‌ను కొన‌సాగించ‌నున్నాడు. ఇక క్లబ్ స్థాయిలో రియాద్‌ మహ్రెజ్ లీసెస్టర్ సిటీతో ఒక ప్రీమియర్ లీగ్ టైటిల్, మాంచెస్టర్ సిటీతో నాలుగు టైటిళ్లు , అలాగే సిటీతో ఒక ఛాంపియన్స్ లీగ్ టైటిల్‌ను సాధించాడు. 2026 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో 4 మ్యాచ్‌లాడిన రియాద్ మ‌హ్రెజ్ 2 గోల్స్‌తో పాటు ఒక అసిస్ట్ అందించాడు. 

'నా రిటైర్మెంట్‌కు ఇదే స‌రైన స‌మ‌యం. స‌హ‌జంగానే అంద‌రి కెరీర్‌లో ఎత్తుప‌ల్లాలు ఉన్న‌ట్లే నా కెరీర్‌లోనే అన్ని క‌ష్టాలు, సంతోషాలు అనుభ‌వించాను. చిన్న‌ప్ప‌టి నుంచి అల్జీరియాకు ప్రాతినిధ్యం వ‌హించ‌డం, నాదేశం కోసం ఆడ‌డమ‌నేది నా క‌ల‌. ఇది నాకు ల‌భించిన అపారమైన గౌర‌వం, గ‌ర్వ‌కార‌ణం. ఇక ఇప్పుడు కొత్త త‌రం ఆడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. అందుకే వీడ్కోలుకు ఇదే స‌రైన స‌మ‌యం అని భావిస్తున్నా. గుడ్‌బై' అని పోస్టు పెట్టాడు.

Read: గోల్‌కీపర్‌ ప్రపంచ రికార్డు.. ప్రిక్వార్ట‌ర్స్‌కు స్పెయిన్‌

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)