హసరంగను ఉతికి ఆరేసిన అనామకుడు.. బంగ్లాదేశ్‌ సంచలనం

Published on Mon, 03/18/2024 - 17:57

శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌.. శ్రీలంకను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లాదేశ్‌ 40.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను చేతిక్కించుకుంది. 

సెంచరీతో ఆదుకున్న లియనగే..
మిడిలార్డర్‌ బ్యాటర్‌ జనిత్‌ లియనగే అజేయ శతకంతో (102 బంతుల్లో 101 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ఓ మోస్తరు స్కోర్‌ చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో లియనగే మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు.

అసలంక 37, కుశాల్‌ మెండిస్‌ 29,  సమరవిక్రమ 14, తీక్షణ 15, హసరంగ 11 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌ 3 వికెట్లు పడగొట్టగా.. ముస్తాఫిజుర్‌, మెహిది హసన్‌ మీరజ్‌ తలో 2, సౌమ్య సర్కార్‌, రిషద్‌ హొసేన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

236 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. తంజిద్‌ హసన్‌ (84) రిషద్‌ హొసేన్‌ (48 నాటౌట్‌), ముష్ఫికర్‌ రహీం (37 నాటౌట్‌) రాణించడంతో మరో 58 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

హసరంగను ఉతికి ఆరేసిన రిషద్‌ హొసేన్‌..
ఈ మ్యాచ్‌లో లంక స్పిన్‌ మాంత్రికుడు వనిందు హసరంగను బంగ్లాదేశ్‌ టెయిలెండర్‌ రిషద్‌ హొసేన్‌ ఉతికి ఆరేశాడు. హసరంగ బౌలింగ్‌లో 11 బంతులను ఎదుర్కొన్న రిషద్‌ 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 40 పరుగులు చేశాడు. రిషద్‌ రెచ్చిపోవడంతో బంగ్లాదేశ్‌ ఊహించిన దానికంటే త్వరగా మ్యాచ్‌ను ముగించింది.


 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)