Breaking News

లార్డ్స్‌ టెస్టులో టీమిండియాకు భారీ షాక్‌

Published on Thu, 07/10/2025 - 19:35

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమిండియాకు ఊహించ‌ని ఎదురదెబ్బ త‌గిలింది. తొలి రోజు ఆట సంద‌ర్భంగా భార‌త వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ గాయ‌ప‌డ్డాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 34వ ఓవ‌ర్ వేసిన జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రెండో బంతిని అందుకునే క్ర‌మంలో పంత్ ఎడ‌మ చేతి వేలికి గాయ‌మైంది.

బంతిని తీసుకున్నాక పంత్ తీవ్ర‌మైన నొప్పితో విల్ల‌విల్లాడు. అంతకుముందు ఓవర్ కూడా పంత్ కాస్త ఆసౌకర్యంగా కన్పించాడు. ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చేసినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలోనే పంత్ ఫిజియో సాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సబ్‌స్ట్యూట్ వికెట్ కీప‌ర్‌గా ధ్రువ్ జురెల్ మైదానంలోకి వ‌చ్చాడు. 

అయితే పంత్ గాయం తీవ్ర‌మైన‌ది కాకుడ‌ద‌ని భార‌త అభిమానులు కోరుకుంటున్నారు. పంత్ ప్ర‌స్తుతం అద్బుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో సెంచ‌రీల మోత మ్రోగించిన పంత్‌.. రెండో టెస్టులో హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు.

41 ఓవ‌ర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 116 ప‌రుగులు చేసింది. క్రీజులో జో రూట్‌(37), పోప్‌(24) ఉన్నారు. ఓపెన‌ర్లు జాక్ క్రాలీ(18), బెన్ డ‌కెట్‌(23)ను నితీశ్ కుమార్ రెడ్డి పెవిలియ‌న్‌కు పంపాడు.

తుదిజట్లు
భారత్‌
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, కరుణ్‌ నాయర్, రిషభ్‌ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్, ఆకాశ్‌దీప్, మహ్మద్‌ సిరాజ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి.

ఇంగ్లండ్‌
బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్), జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్, క్రిస్‌ వోక్స్, బ్రైడన్‌ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయబ్‌ బషీర్‌.
చదవండి: IND vs ENG: టీమిండియా చెత్త రికార్డు.. ప్ర‌పంచంలోనే తొలి జ‌ట్టుగా

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)