మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
Rishabh Pant: ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు: పంత్ కౌంటర్ మామూలుగా లేదు!
Published on Mon, 08/15/2022 - 13:45
టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా మధ్య సోషల్ మీడియా వార్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఇద్దరూ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వరుస పోస్టులతో పరస్పరం విరుచుకుపడుతున్నారు. కాగా తన కోసం ఆర్పీ అనే వ్యక్తి ఎయిర్‌పోర్టులో గంటల తరబడి వేచి చూశాడంటూ ఊర్వశి ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అంతేకాదు తన ఫోన్ కాల్ కోసం పిచ్చివాడిలా ఎదురుచూశాడని, అయితే అతడి పేరును మాత్రం వెల్లడించలేనని చెప్పుకొచ్చింది. దీంతో ఆర్పీ అంటే రిషభ్ పంతేనంటూ ఊర్వశి వ్యాఖ్యలను హైలెట్ చేశారు నెటిజన్లు. ఇందుకు స్పందించిన రిషభ్ పంత్.. కొందరు ఫేమస్ అవడానికి అబద్ధాలు ఆడతారని అక్కా ప్లీజ్ నన్ను వదిలెయ్ అంటూ పరోక్షంగా ఊర్వశిని ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో కౌంటర్ ఇచ్చాడు.
Urvashi speaking about Rishabh Pant 😅#UrvashiRautela pic.twitter.com/SXPlY85KPl
— Nisha Kashyap (@nishakashyapp) August 9, 2022
ఇందుకు బదులుగా.. ఊర్వశి సైతం.. ‘‘తమ్ముడూ.. నువ్వో పిల్ల బచ్చా.. బ్యాట్, బాల్‌కే అంటే ఆటకే పరిమితమవ్వు’’ ఘాటుగానే స్పందించింది. ఊర్వశి పోస్టుతో చిర్రెత్తిపోయాడో ఏమో గానీ రిషభ్ పంత్.. ‘‘నీ ఆధీనంలో లేని విషయాల గురించి నువ్వు మరీ ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వద్దు’’ అంటూ కౌంటర్ వేశాడు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో తన ఫొటోను షేర్ చేస్తూ కోట్ యాడ్ చేశాడు.
దీనిపై స్పందించిన పంత్ అభిమానులు.. ‘‘భయ్యా.. ఇలాంటివి పట్టించుకోవద్దు. టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత నీది. అనవసర విషయాల మీద శ్రద్ధ పెట్టకు. కేవలం ఆట మీదే దృష్టి సారించు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా టీమిండియాలో కీలక సభ్యుడైన 24 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ విదేశీ గడ్డ మీద టెస్టుల్లో భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించి ప్రశంసలు అందుకున్నాడు.
ఇటీవలే అతడు ఉత్తరాఖండ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నియమితుడయ్యాడు. ఆసియా కప్-2022 ఆడే భారత జట్టులోనూ చోటు దక్కించుకున్న పంత్.. మెగా ఈవెంట్‌కు సన్నద్ధం అవుతున్నాడు.
చదవండి: Asia Cup 2022 : కోహ్లి ఫామ్‌లోకి వస్తే అంతే సంగతులు.. పాకిస్తాన్‌కు ఆ దేశ మాజీ కెప్టెన్ వార్నింగ్!
Ind Vs Zim: కోహ్లి, రోహిత్ లేరు.. టీమిండియాను 2-1తో ఓడిస్తాం: జింబాబ్వే బ్యాటర్! ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు భయ్యా!
Tags : 1