Breaking News

డ్రైవర్‌ను పెట్టుకునే స్థోమత ఉన్నపుడు ఎందుకిలా: టీమిండియా దిగ్గజం

Published on Mon, 01/02/2023 - 14:39

Rishabh Pant Car Accident: ‘‘మీకో మంచి కారు ఉంటుంది. అత్యంత వేగంగా రయ్‌మని దూసుకుపోగలదు కూడా! కానీ ఆచితూచి వ్యవహరించాలి. డ్రైవర్‌ను పెట్టుకునే స్థోమత మీకు ఉంటుంది. కాబట్టి ఒంటరిగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లకండి. అయితే, ఒక్కొక్కరికి ఒక్కో విషయం పట్ల ఆసక్తి ఉంటుంది. ప్యాషన్‌ ఉంటుంది. యవ్వనంలో ఉన్నపుడు ఇలాంటివి సహజం. కానీ మీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి.

ఏదేమైనా మీ పట్ల మీరే శ్రద్ధ వహించాలి.  మీకేం కావాలో.. భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకోగలగాలి. అంతా సాఫీగా ఉండాలంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి’’ అని టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ యువ క్రికెటర్లకు సూచించాడు. డ్రైవింగ్‌ చేసే సమయంలో జాగ్రత్తవహించాలని విజ్ఞప్తి చేశాడు.

కాగా టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రాణాలతో బయటపడ్డ అతడికి చికిత్స జరుగుతోంది. ఈ నేపథ్యంలో కపిల్‌ దేవ్‌ ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

థాంక్‌ గాడ్‌! పంత్‌ బయటపడ్డాడు
పంత్ క్షేమంగా బయటపడటం పట్ల హర్షం వ్యక్తం చేసిన కపిల్‌ దేవ్‌.. ఏదేమైనా వాహనాలు నడిపే సమయంలో ఈ మేరకు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అదే విధంగా గతంలో తనకు ఎదురైన అనుభవాలు పంచుకున్నాడు.

‘‘నేను క్రికెట్‌ ఆడుతున్న తొలినాళ్లలో మోటార్‌ సైకిల్‌ నడుపుతూ ప్రమాదానికి గురయ్యాను. ఆ తర్వాత నుంచి నా సోదరుడు నన్ను మోటార్‌ బైక్‌ నడిపేందుకు అస్సలు అనుమతి ఇవ్వలేదు’’ అని కపిల్‌ దేవ్‌ చెప్పుకొచ్చాడు. రిషభ్‌ పంత్‌ ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకోగలిగారని పేర్కొన్నాడు.

చదవండి: Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్‌, జట్లు, ఇతర వివరాలు
BBL: సంచలన క్యాచ్‌.. బిక్క ముఖం వేసిన బ్యాటర్‌! ఇంతకీ అది సిక్సరా? అవుటా?

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)