Breaking News

మరోసారి చెలరేగిన రింకూ సింగ్‌.. ఆసియా కప్‌కు ముందు ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published on Wed, 08/27/2025 - 17:26

గత కొంతకాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయనప్పటికీ.. ఆసియా కప్‌ బెర్త్‌ దక్కించుకున్న టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌ను కొద్ది రోజుల ముందు వరకు విమర్శకులు టార్గెట్‌ చేశారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌ టీ20 లీగ్‌ ప్రారంభం కాగానే వారి స్వరం మారిపోయింది. ఈ టోర్నీలో రింకూ బ్యాటర్‌గానే కాకుండా బౌలర్‌గానూ రాణిస్తున్నాడు. 

బ్యాటింగ్‌లో యాధాతథంగా మెరపులు మెరిపిస్తూనే.. స్పిన్‌ బౌలింగ్‌లోనూ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇకపై తాను కేవలం ఫినిషర్‌ను మాత్రమే కాదు బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్నంటూ సంకేతాలు పంపాడు.

ఈ టోర్నీలో మీరట్‌ మెవెరిక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ.. గోరఖ్‌పూర్‌ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం (108) బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు చివరి 6 బంతుల్లో 5 సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించి, తనలోని ఫినిషింగ్‌ సామర్థ్యాన్ని మరోసారి చాటుకున్నాడు.

తాజాగా రింకూ మరో మెరుపు ప్రదర్శన చేసి ఆసియా కప్‌కు ముందు ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఇవాళ (ఆగస్ట్‌ 27) లక్నో ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేసి తన జట్టు భారీ స్కోర్‌ చేయడానికి దోహదపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌ తర్వాత రింకూలో కా​న్ఫిడెన్స్‌ మరింత పెరిగినట్లు కనిపించింది. 

ఇదే ఫామ్‌ను అతను ఆసియా కప్‌లోనూ కొనసాగిస్తే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఆసియా కప్‌కు ముందు చాలామంది రింకూ జట్టులో అవసరమా అని ప్రశ్నించారు. అతడి బదులు శ్రేయస్‌ అయ్యర్‌నో లేక బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌లో తీసుకోవాల్సిందని చర్చించుకున్నారు. 

అయితే తనపై చర్చలు అనవసరమని రింకూ తాజా ప్రదర్శనలతో నిరూపించాడు. కేవలం విధ్వంసకర బ్యాటర్‌గా, ఫినిషర్‌గా మాత్రమే కాకుండా బౌలింగ్‌లోనూ రాణించగలనని సంకేతాలు పంపాడు. ఈ టోర్నీలో రింకూ 10కి పైగా ఓవర్లు వేసి బౌలర్‌గానూ మంచి మార్కులే కొట్టాడు. ఓ మ్యాచ్‌లో అతడు తీసిన వికెట్‌ బాగా హైలైటైంది. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. లక్నో ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన మీరట్‌.. రింకూతో పాటు స్వస్తిక్‌ చికారా (55), రితురాజ్‌ శర్మ (74 నాటౌట్‌) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఫాల్కన్స్‌ 6.2 ఓవర్ల తర్వాత వికెట్‌ నష్టానికి 40 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)