Breaking News

రింకూ సింగ్‌ విధ్వంసం.. 33 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో..!

Published on Thu, 11/02/2023 - 13:54

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ 2023లో టీమిండియా యువ చిచ్చరపిడుగు రింకూ సింగ్‌ విధ్వంసం సృష్టించాడు. పంజాబ్‌తో ఇవాళ (నవంబర్‌ 2) జరుగుతున్న క్వార్టర్‌ఫైనల్‌-1లో రింకూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు. రింకూ విధ్వంసం ధాటికి పంజాబ్‌ ఆఖరి రెండు ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుంది.

ఆఖరి ఓవర్లో రింకూ టీమిండియా సహచరుడు అర్షదీప్‌ సింగ్‌ను టార్గెట్‌ చేశాడు. ఈ ఓవర్లో రింకూ 3 సిక్సర్ల సాయంతో 23 పరుగులు పిండుకున్నాడు. రింకూ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉత్తర్‌ప్రదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రింకూతో పాటు సమీర్‌ రిజ్వి (29 బంతుల్లో 42 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) రాణించాడు.

యూపీ ఇన్నింగ్స్‌లో గోస్వామి (16), కరణ్‌ శర్మ (14), నితీశ్‌ రాణా (17) తక్కువ స్కోర్లకే ఔటైనా సమీర్‌ అండతో రింకూ చెలరేగిపోయాడు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో సిద్దార్థ్‌ కౌల్‌, హర్ప్రీత్‌ బ్రార్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. నితీశ్‌ రాణా రనౌటయ్యాడు. 

అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (42 నాటౌట్‌), నేహల్‌ వధేరా (21 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ శర్మ (12), ప్రభసిమ్రన్‌ సింగ్‌ (0), మన్‌దీప్‌ సింగ్‌ (1) నిరాశపరచగా.. అన్మోల్‌ప్రీత్‌, నేహల్‌ జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. యూపీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ పొదుపుగా (2 ఓవర్లలో 3 పరుగులు) బౌలింగ్‌ చేయడంతో పాటు 2 వికెట్లు పడగొట్టాడు. మోహిసిన్‌ ఖాన్‌కు మరో వికెట్‌ దక్కింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)