Breaking News

ఎట్టకేలకు బోణీ కొట్టిన కేకేఆర్‌.. రాజస్తాన్‌పై విజయం

Published on Sun, 04/19/2026 - 19:50

ఐపీఎల్‌-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(46), యశస్వి జైశ్వాల్(39) తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎట్టుకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో వరుణ్‌ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు కార్తీక్‌ త్యాగి మూడు, సునీల్‌ నరైన్‌ రెండు వికెట్లు సాధించాడు.

గెలిపించిన రింకూ, అనుకుల్‌
అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్లు టిమ్ సీఫర్ట్‌, రహానే ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత గ్రీన్‌(27) కాస్త దూకుడుగా ఆడి రాజస్తాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు.

దూకుడుగా ఆడిన గ్రీన్ కూడా బిష్ణోయ్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. వెంటనే రఘువంశీ కూడా ఔటయ్యాడు. ఈ క్రమంలో రింకూ సింగ్‌, పావెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పావెల్(23) కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రమణ్‌దీప్(10) ప్రభావం చూపలేకపోయాడు.

దీంతో కేకేఆర్‌కు మరో ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ రింకూ సింగ్‌(53 నాటౌట్‌), అనుకుల్ రాయ్‌(29 నాటౌట్‌) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. ఫలితంగా 156 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్‌ 19.4 ఓవర్లలో 6 వి​కెట్లు కోల్పోయి చేధించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)