Breaking News

తొలిసారి బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం.. మా అమ్మ కల నెరవేరింది!

Published on Fri, 08/18/2023 - 11:03

ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 ఇరు జట్ల మధ్య డబ్లిన్‌ వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ సిరీస్‌తో టీమిండియా పేస్‌గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు 11 నెలల తర్వాత బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు.

అంతేకాకుండా ఐరీష్‌ టూర్‌లో బుమ్రానే భారత జట్టు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనకు సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. ఐపీఎల్‌-2023లో అదరగొట్టిన రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ, తిలక్‌ వర్మ, జైశ్వాల్‌ వంటి యువ ఆటగాళ్లకు చోటుకల్పించారు. అయితే తిలక్‌ వర్మ, జైశ్వాల్‌ ఇప్పటికే విండీస్‌ టూర్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టగా.. రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ తమ అరంగేట్రం కోసం అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సిరీస్‌ కోసం బుమ్రా సారథ్యంలోని భారత జట్టు బుధవారం ఐర్లాండ్‌కు చేరుకుంది.

తొలిసారి..
భారత జట్టుకు ఎంపికైన  రింకూ సింగ్, జితేశ్ శర్మలు తొలిసారి బిజినెస్ క్లాస్ విమానంలో ప్రయాణించారు. ఈ క్రమంలో వీరిద్దరూ తమ తొలి అంతర్జాతీయ పర్యటనకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్‌చేసింది. "నాకు చాలా సంతోషంగా ఉంది. టీమిండియాకు ఆడాలనేది ప్రతీ ఒక్క ఆటగాడి కల. నేను నా గదిలోకి వెళ్లి.. నా పేరు, 35 నంబర్‌ ముద్రించిన జెర్సీని చూడగానే  భావోద్వేగానికి లోన‌య్యా.

ఈ రోజు కోసమే నేను కష్టపడ్డాను. నేను భారత జట్టు ఎంపికైనప్పుడు నా స్నేహితులతో నోయిడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. వెంటనే మా అ‍మ్మకు ఫోన్‌ చేశాను. నేను ఈ స్ధాయిలో ఉన్నానంటే అందుకు ఒక కారణం మా అమ్మ కూడా. ఆమెకు నాకు ఎంతో సపోర్ట్‌గా ఉంటుంది. భారత్‌ తరపున ఆడాలన్నది నా ఒక్కడి కలే కాదు మా అమ్మది కూడా. ఇప్పడు మా ఇద్దరి కల నిజమైందని" బీసీసీఐ షేర్‌ చేసిన వీడియోలో రింకూ చెప్పుకొచ్చాడు.

అదే విధంగా జితేష్‌ శర్మ మాట్లాడుతూ.. నిజం చెప్పాలంటే ఈ సంతోషంలో నాకు మాటలు కూడా రావడం లేదు. భారత క్రికెట్‌ జట్టుతో కలిపి విదేశాల్లో పర్యటించడం గొప్ప అనుభవం. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం అనేది మనకు లభించిన గౌరవం. అంతేకాకుండా బాధ్యత కూడా  మన సత్తా చూపించుకునేందుకు ఇదొక మంచి అవకాశం. నాకు ఆడేందుకు అవకాశం లభిస్తే 100 శాతం ఎఫక్ట్‌ భారత్‌ను గెలిపించేందుకు పెడతాను "అని పేర్కొన్నాడు.
చదవండి: BAN vs NZ: బంగ్లాదేశ్‌ పర్యటనకు న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు.. 10 ఏళ్ల తర్వాత

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)