Breaking News

తీవ్ర విషాదం.. రింకూ సింగ్‌ తండ్రి కన్నుమూత

Published on Fri, 02/27/2026 - 08:30

టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ రింకూ సింగ్‌ ఇంట తీవ్ర విషాదం​ చోటు చేసుకుంది. గత కొంతకాలంగా స్టేజ్‌-4 లివర్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న రింకూ తండ్రి ఖాచంద్ర సింగ్‌ ఇవాళ తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఖాచంద్ర సింగ్‌ గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. 

పరిస్థితి మరింత విషమించడంతో నిన్న రీనల్ రీప్లేస్‌మెంట్ థెరపీ (CRRT) కూడా నిర్వహించినట్టు సమాచారం. వైద్యులు శక్తివంచన లేకుండా కృష్టి చేసినా రింకూ తండ్రిని కాపాడలేకపోయారు.

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ 2026తో బిజీగా ఉన్న రింకూ సింగ్‌ తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించిదని తెలిసి హుటాహుటిన నోయిడాకు బయల్దేరాడు. అక్కడ రెండు రోజులు గడిపి, జింబాబ్వేతో కీలకమైన జింబాబ్వే మ్యాచ్‌ కోసం తిరిగి చెన్నైకి చేరుకున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్‌ సమయానికి రింకూ జట్టులో చేరినప్పటికీ.. తుది జట్టులో అవకాశం దక్కలేదు. అయినా, ఈ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించి సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

తండ్రి మరణవార్త విని రింకూ హుటాహుటిన తన స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని అలీఘఢ్‌కు బయల్దేరాడు. 28 ఏళ్ల రింకూ చాలా పేద కుటుంబం నుంచి ఎదిగి భారత జట్టులో స్థానం సంపాదించాడు. తన సక్సెస్‌లో తండ్రి పాత్ర చాలా కీలకమని రింకూ గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు. రింకూ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగినప్పటికీ.. అతని తండ్రి గ్యాస్‌ డెలివరీ చేస్తూనే జీవనం సాగించాడు. రింకూ తండ్రి మరణవార్త తెలిసి టీమిండియాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)