Breaking News

ఖరీదైన ఇంటిని కొన్న రింకూ సింగ్‌.. ఎన్ని కోట్లంటే?

Published on Thu, 11/07/2024 - 12:58

ఐపీఎల్‌-2025 సీజ‌న్ మెగా వేలానికి ముందు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ రింకూ సింగ్‌ను రూ. 13 కోట్ల భారీ ధ‌ర‌కు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ రిటైన్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఫ్రాంచైజీ నుంచి భారీగా సొమ్ము రావ‌డంతో రింకూ సింగ్ ఎట్ట‌కేల‌కు త‌న సొంతంటి క‌ల‌ను నేర‌వేర్చుకున్నాడు.

అలీఘర్‌లోని ఓజోన్ సిటీలో ఖరీదైన విల్లాను రింకూ సింగ్‌ కొనుగోలు చేశాడు. 500 చదరపు గజాల స్థ‌లం గ‌ల ఇంటిని రూ. 3.5 కోట్ల భారీ మొత్తం వెచ్చించి రింకూ సొంతం చేసుకున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతున్నాయి. 

కాగా ఒకప్పుడు ఇదే ఓజోన్‌ సిటీలోని రింకూ తండ్రి గ్యాస్ సిలిండర్లు ​వేసి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఇప్పుడు అదే సొసైటీలో కొడుకు విల్లాను కొనుగోలు చేసి తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. దీంతో రింకూపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది కాదా సక్సెస్‌ అని రింకూను కొనియాడుతున్నారు.

ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు..
కాగా ఐపీఎల్‌-2023 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ యశ్‌దయాల్‌ బౌలింగ్‌లో ఆఖరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది రింకూ ఓవర్‌ నైట్‌స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత భారత జట్టులోకి రింకూ ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా రింకూ తన మార్క్‌ను చూపించాడు. కాగా ఐపీఎల్‌ 2024 సీజన్‌ రింకూ సింగ్‌‌కు రూ. 55 లక్షల వేతనం మాత్రమే వచ్చేది. కానీ తన అద్బుతప్రదర్శనలతో రింకూ ఇప్పుడు కోటీశ్వరుడు అయిపోయాడు.

ఈ ఏడాది నుంచి అతడు రూ. 13 కోట్లు అందుకుంటాడు. కేకేఆర్‌ అంటిపెట్టుకున్న వారిలో రింకూనే టాప్‌​ రిటెన్షన్‌​ కావడం గమనార్హం. రింకూ సింగ్‌ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సన్నద్దమవుతున్నాడు.
చదవండి: #Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఊచకోత.. కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)