Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా
Breaking News
ప్రొటీస్‌తో టి20 సిరీస్.. టీమిండియాకు ఎదురుదెబ్బ
Published on Wed, 05/11/2022 - 10:07
ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరస్‌కు సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మోచేతి కండరం గాయంతో బాధపడుతున్న సూర్యకుమార్ ఐపీఎల్ 15వ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం తీవ్రతను బట్టి సూర్యకు నాలుగు వారాలపాటు విశ్రాంతి అవసరం అని తేలింది.
దీంతో అతను సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు దూరం కానున్నాడు. ఇక జూన్ 9 నుంచి 19 వరకు ఇరుజట్ల మధ్య 5 టి20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక గాయంతో ఐపీఎల్ నుంచి వైదొలిగిన సూర్య రీహాబిలిటేషన్‌లో భాగంగా బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రిపోర్ట్ చేయనున్నాడు. కాగా సూపర్‌ఫామ్‌లో ఉన్న సూర్య ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున 8 మ్యాచ్‌ల్లో 309 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్థసెంచరీలు ఉన్నాయి.
చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం..!
Tags : 1