Breaking News

మరో ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్న ఆర్సీబీ హెడ్‌ కోచ్‌

Published on Mon, 06/30/2025 - 18:17

మహిళల ఆర్సీబీ హెడ్‌ కోచ్‌ లూక్‌ విలియమ్స్‌ మహిళల హండ్రెడ్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2025 సీజన్‌ కోసం సథరన్‌ బ్రేవ్‌ హెడ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుత కోచ్‌ చార్లోట్‌ ఎడ్వర్డ్స్‌ ఇంగ్లండ్‌ మహిళల జట్టుకు హెడ్‌ కోచ్‌గా వెళ్లడంతో లూక్‌ నియామకం జరిగింది.

లూక్‌ హండ్రెడ్‌ లీగ్‌ ప్రారంభ ఎడిషన్‌ నుంచి చార్లోట్‌ ఎడ్వర్డ్స్‌కు డిప్యూటీగా వ్యవహరించాడు. వీరి ఆధ్వర్యంలో బ్రేవ్‌ 2021, 2022 ఎడిషన్లలో రన్నరప్‌గా.. 2023 ఎడిషన్‌లో విజేతగా నిలిచింది.

లూక్‌ మహిళల ఐపీఎల్‌లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీకి తొలి టైటిల్‌ను అందించాడు. 2024 ఎడిషన్‌లో లూక్‌ ఆధ్వర్యంలో ఆర్సీబీ టైటిల్‌ ఎగరేసుకుపోయింది. లూక్‌కు మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. అతని ఆథ్వర్యంలో అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ వరుసగా 2022, 2023 ఎడిషన్లలో విజేతగా నిలిచింది.

బ్రేవ్‌ ఫ్రాంచైజీ రానున్న సీజన్‌ కోసం లూక్‌తో పాటు మరో కీలక నియామకం చేపట్టింది. ఆ ఫ్రాంచైజీ తమ బ్యాటింగ్‌ కోచ్‌గా ఇంగ్లండ్‌ మాజీ ఓపెనర్‌ మార్కస్‌ ట్రెస్కోధిక్‌కు నియమించుకుంది. జిమ్మీ కానర్స్‌ స్థానంలో ట్రెస్కోధిక నియామకం జరిగింది.

సథరన్‌ బ్రేవ్‌ గత సీజన్‌లో ఘోర ప్రదర్శన చేసింది. 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.

2025 మహిళల హండ్రెడ్‌ లీగ్‌ కోసం సథరన్ బ్రేవ్ జట్టు.. 
లారా వోల్వార్డ్, డాని వ్యాట్-హాడ్జ్, మైయా బౌచియర్, లారెన్ బెల్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, రియానా సౌత్‌బై, సోఫీ డెవిన్, క్లోయ్ ట్రయాన్, మాడీ విలియర్స్, జోసీ గ్రోవ్స్, ఫోబ్ గ్రాహం
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)