CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు
Breaking News
#AnujRawat: తొలిసారి తన పాత్రకు న్యాయం చేశాడు
Published on Sun, 05/14/2023 - 17:43
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ బ్యాటర్ అనూజ్ రావత్ తొలిసారి మెరిశాడు. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 11 బంతుల్లో 29 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. అతని మెరుపుల వల్లే ఆర్సీబీ 170 పరుగుల స్కోరు చేయగలిగింది.
అంతకముందు డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్‌లు అర్థశతకాలతో రాణించినప్పటికి స్కోరును పెంచే యత్నంలో ఇద్దరు ఒకేసారి ఔట్ అయ్యారు. ఈ క్రమంలో అనూజ్ రావత్ తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. రాజస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు ఈ సీజన్లో ఆరు మ్యాచ్‌లాడిన అనూజ్ రావత్ కేవలం 39 పరుగులే చేశాడు.
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 4 బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసి కీలకసమయంలో వెనుదిరిగి విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం కీలకసమయంలో మంచి ఇన్నింగ్స్ ఆడి అభిమానులు మెచ్చుకునేలా చేశాడు.
0,4,2,1,4,1,1,0,6,6,4 - WHAT A FINISH BY ANUJ RAWAT.
— CricketMAN2 (@ImTanujSingh) May 14, 2023
He smashed 29*(11) with the strike rate 263.6. Incredible Anuj Rawat. pic.twitter.com/3M6WZ4nhaN
చదవండి: డుప్లెసిస్ అరుదైన ఘనత.. నాలుగో విదేశీ ప్లేయర్‌గా
Tags : 1