Breaking News

దిగ్గజ ఆల్‌రౌండర్‌ రికార్డు బద్దలు కొట్టిన జడేజా

Published on Fri, 02/10/2023 - 21:30

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తన ప్రదర్శనతో అందరి మనసులు దోచుకుంటున్నాడు. రీఎంట్రీ ఇస్తూనే బౌలింగ్‌లో ఐదు వికెట్ల హాల్‌ అందుకున్న జడేజా.. బ్యాటింగ్‌లో అర్థసెంచరీతో రాణించాడు. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై నింపాదిగా బ్యాటింగ్‌ చేసి అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో జడ్డూకు ఇది 18వ అర్థశతకం.

ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా దిగ్గజం కపిల్‌ దేవ్‌ రికార్డును బద్దలుకొట్టాడు. టీమిండియా తరపున ఒక టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు సహా అర్థసెంచరీ చేయడం జడేజాకు ఇది ఐదోసారి. ఇంతకముందు కపిల్‌ దేవ్‌ నాలుగుసార్లు ఈ ఫీట్‌ అందుకున్నాడు. తాజాగా జడ్డూ ఐదోసారి ఈ ఫీట్‌ సాధించి కపిల్‌ రికార్డును చెరిపేసి అగ్రస్థానంలో నిలిచాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలి టెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ సెంచరీతో ఆకట్టుకోగా.. జడేజా 66, అక్షర్‌ పటేల్‌ 52 పరుగులతో అజేయ అర్థశతకాలతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజు ఆట మ్యాచ్‌ ఫలితాన్ని నిర్ధేశించనుంది.

చదవండి: ఎన్నాళ్లకు దర్శనం.. ఇంత అందంగా ఎవరు తిప్పలేరు

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)