Breaking News

రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు..!

Published on Wed, 11/12/2025 - 19:23

ఐపీఎల్‌ 2026కి ముందు సంచలన ట్రేడ్ డీల్‌ జరుగుతోంది. రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ను దక్కించుకునేందుకు ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ రవీంద్ర జడేజా, సామ్‌ కర్రన్‌ను వదులుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. 

ఈ మేరకు ఫార్మాలిటీస్‌ కూడా పూర్తైనట్లు సమాచారం. డీల్‌లో భాగంగా సంజూ సీఎస్‌కేలో చేరేందుకు.. జడేజా, కర్రన్‌ రాయల్స్‌లో తరఫున ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారట.

అయితే చివరి నిమిషంలో రవీంద్ర జడేజా ఓ మెలిక పెట్టినట్లు ఐపీఎల్‌ వర్గాలు అంటున్నాయి. రాయల్స్‌లో చేరితే తనకు కెప్టెన్సీ ఇవ్వాలని జడ్డూ కండీషన్‌ పెట్టాడట. ఇందుకు రాయల్స్‌ యాజమాన్యంలోని కొందరు అంగీకరించినప్పటికీ.. ఓ కీలక వ్యక్తి అడ్డు పడినట్లు సమాచారం.

సంజూ ఫ్రాంచైజీని వీడాలనుకున్నప్పుడు సదరు వ్యక్తి అప్పటికే జట్టులో ఉన్న ఇద్దరి పేర్లను కెప్టెన్సీ కోసం పరిశీలిస్తానని మాట ఇచ్చాడట. ఇప్పుడు కొత్తగా జడ్డూ కెప్టెన్సీ కోసం​ డిమాండ్‌ చేయడంతో యాజమాన్యంలో భేదాభిప్రాయాలు వచ్చాయని సమాచారం. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే సీఎస్‌కేతో ట్రేడ్‌ డీల్‌ క్యాన్సల్‌ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. 

కాగా, సంజూ రాయల్స్‌ను వీడే విషయం ఖరారైన తర్వాత యాజమాన్యం ధృవ్‌ జురెల్‌, యశస్వి జైస్వాల్‌ పేర్లను కెప్టెన్సీ కోసం​ పరిశీలిస్తుంది. గత సీజన్‌లో సంజూ గైర్హాజరీలో రియాన్‌ పరాగ్‌ నాయకుడిగా వ్యవహరించినా.. అతని పేరు ప్రస్తావనకు రాలేదు. కొత్తగా జడేజా పేరు తెరపైకి రావడంతో రాయల్స్‌ యాజమాన్యం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఐపీఎల్‌ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

జడ్డూ ప్రొఫైల్‌ని బట్టి చూస్తే.. రాయల్స్‌ కెప్టెన్‌గా నియమించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అతని ఐపీఎల్‌ కెరీర్‌ ఈ ఫ్రాంచైజీతోనే మొదలైంది. అతనికి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా ఉంది. పైగా ఇటీవలికాలంలో అతను టీమిండియా విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించాడు.

సంజూ విషయానికొస్తే.. డీల్‌ కుదిరి అతను సీఎస్‌కేలో చేరినా కెప్టెన్సీ దక్కే అవకాశం మాత్రం లేదు. సీఎస్‌కేలో సంజూ సాధారణ ఆటగాడిగా కొనసాగాల్సి ఉంటుంది. రుతురాజ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించే యోచనలో సీఎస్‌కే యాజమాన్యం లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. 

పై విషయాలపై క్లారిటీ రావాలంటే నవంబర్ 15 వరకు వేచి చూడాల్సిందే. ఆ రోజులోపు ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంది. 

చదవండి: ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)