Breaking News

Ravindra Jadeja: 'నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా..'

Published on Sat, 02/11/2023 - 17:38

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్టుల్లో మరోసారి తన ముద్ర చూపించాడు. దాదాపు ఐదు నెలలు ఆటకు దూరమైనప్పటికి రీఎంట్రీ మ్యాచ్‌లోనే అదరగొట్టేశాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో అలరించి ఆల్‌రౌండర్‌ అనే పదానికి మరోసారి సరైన నిర్వచనం చెప్పాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏడు వికెట్లు తీసిన జడ్డూ.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ రాణించాడు.

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా 70 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 88 పరుగులు జోడించి టీమిండియాను పటిష్టమైన స్థానంలో నిలిపాడు. మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించినందుకు గానూ జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.  ఇక మ్యాచ్‌ విజయం అనంతరం జడేజా మాట్లాడాడు.

''అద్భుతమమైన అనుభూతి కలుగుతుంది. దాదాపు ఐదు నెలల తర్వాత క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చి వంద శాతం ప్రదర్శన(బ్యాట్‌తో పరుగులు, బంతితో వికెట్లు) ఇస్తే ఎవరికైనా సంతోషమే కలుగుతుంది. రీఎంట్రీలో నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నా. రీఎంట్రీకి ముందు ఎన్‌సీఏలో చాలా కష్టపడ్డా.. అందుకు సహకరించిన ఎన్‌సీఏ స్టాఫ్‌తో పాటు ఫిజియోలకు ప్రత్యేక కృతజ్థతలు. ఒక్కోసారి ఆదివారాలు కూడా నాకోసం పనిచేసేవారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. బంతి వికెట్ల మీదకు వస్తుండడంతో మా పని సులవుగా మారింది. ఆసీస్‌ ఆటగాళ్లు తప్పు చేశారంటే మాకు చాన్స్‌ వచ్చినట్లే. దానిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాం. ఇక బ్యాటింగ్‌లోనూ రాణించడం మంచి పరిణామం. ఏ స్థానంలో బ్యాటింగ్‌ వస్తున్నామన్నది ముఖ్యం కాదు.. 5,6,7.. ఇలా ఏ స్థానమైన నాకు పర్లేదు.. ఎందుకంటే చివరికి నా బ్యాట్‌ నుంచి వచ్చేది పరుగులే కాబట్టి.'' అంటూ చెప్పుకొచ్చాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)