Breaking News

పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మరో టీమిండియా స్టార్‌

Published on Sun, 06/30/2024 - 17:37

టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్‌ ఆటగాడు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. జడ్డూ మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్‌) కొనసాగుతానని స్పష్టం చేశాడు. 

పొట్టి ప్రపంచకప్‌ గెలవడంతో తన కల నిజమైందని అన్నాడు. టీ20 కెరీర్‌లో వరల్డ్‌కప్‌ గెలవడం అత్యుత్తమమని తెలిపాడు. కెరీర్‌లో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలని పేర్కొన్నాడు. చివరిగా జై హింద్‌ అని రాసుకొచ్చాడు. 35 ఏళ్ల రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20ల్లో 74 మ్యాచ్‌లు ఆడి 127.2 స్టయిక్‌రేట్‌తో 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు.

కాగా, సౌతాఫ్రికాతో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కు ఇది రెండో ప్రపంచకప్‌. 2007లో (అరంగేట్రం ఎడిషన్‌) ధోని సారథ్యంలో పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన భారత్‌... తాజాగా రోహిత్‌ శర్మ నేతృత్వంలో రెండోసారి జగజ్జేతగా నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో విరాట్‌ కోహ్లి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా వరల్డ్‌కప్‌ గెలిచిన అనంతరం కోహ్లి, రోహిత్‌ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు గుడ్‌ బై చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)