Breaking News

షమీ చెవులు పిండిన అశ్విన్‌.. ఫోటో వైరల్‌

Published on Fri, 02/17/2023 - 16:16

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన రెండో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆట తొలిరోజునే టీమిండియా బౌలర్లు మంచి ప్రదర్శన కనబరచడంతో ఆస్ట్రేలియా ఆలౌట్‌ అయ్యేలా కనిపిస్తోంది. అయితే తొలి టెస్టుతో పోలిస్తే ఆసీస్‌ బ్యాటర్లు కాస్త ప్రతిఘటించారు తప్ప మరోసారి స్పిన్‌ ఉచ్చులో పడిపోయారు. జడేజా, అశ్విన్‌లకు తోడు షమీ కూడా రాణించడంతో ఆస్ట్రేలియా పరుగులు చేసినప్పటికి వికెట్లు కోల్పోయింది. 

ఈ సంగతి పక్కనబెడితే ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్‌ను షమీ దక్కించుకున్నాడు. 10 పరుగులు చేసిన నాథన్‌ లియోన్‌ అతని బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. షమీ ఖాతాలో ఇది మూడో వికెట్‌. సెలబ్రేషన్‌ సమయంలో షమీ వెనుక వచ్చి నిల్చున్న అశ్విన్‌ గుడ్‌ బౌలింగ్‌ యార్‌ అంటూ చెవులు పిండాడు. అయితే అశ్విన్‌ కాస్త గట్టిగా పిండాడనుకుంటా.. నొప్పితో షమీ మొహం మారిపోయింది. అయితే ఇదంతా సరదాగా చేయడంతో టీమిండియా క్రికెటర్ల మధ్య నవ్వులు విరపూశాయి.

ఇక రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నిం‍గ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లతో పాటు షమీ కూడా చెలరేగడంతో ఆసీస్‌ తొలిరోజునే తన ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది. ఆసీస్‌ బ్యాటర్లలో ఉస్మాన్‌ ఖవాజా 81 పరుగులు చేయగా.. పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌ 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. షమీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అశ్విన్‌, జడేజాలు చెరొక మూడు వికెట్లు తీశారు.

చదవండి: పుజారా వందో టెస్టు.. కుటుంబం మొత్తం స్టేడియంలో

'చేసేయాల్సింది ఒక పనైపోయేది..'

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)