Breaking News

అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేదా? ఇదేమి కెప్టెన్సీరా బాబోయ్‌!

Published on Mon, 04/20/2026 - 17:15

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో వ‌రుస‌గా నాలుగు విజయాల‌తో మంచి జోష్‌లో క‌న్పించిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఇప్పుడు ఢీలా ప‌డింది. ఆదివారం ఈడెన్‌గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్ ఓట‌మి పాలైంది. రాజ‌స్తాన్‌కు ఇది వ‌రుస‌గా రెండో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం.

మొన్న‌టి వ‌ర‌కు పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్ధానంలో కొన‌సాగిన రాయ‌ల్స్‌.. ఇప్పుడు మూడో స్ధానానికి పడిపోయింది. అయితే సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సరిగ్గా ఉపయోగించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది సీజన్‌కు ముందు సీఎస్‌కే నుంచి జడేజాను రాజస్తాన్ ట్రేడ్ చేసుకుంది.

కానీ జడేజా లాంటి ఆల్‌రౌండ‌ర్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌డంలో రాజ‌స్తాన్ విఫ‌ల‌మైంద‌నే చెప్పుకోవాలి. ఈ ఏడాది సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 6 మ్యాచ్‌లు ఆడిన జ‌డ్డూ..కేవ‌లం 10 ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చేశాడు. అప్ప‌టికి ఐదు వికెట్లు జ‌డేజా ప‌డ‌గొట్టాడు. ఓ రెండు మ్యాచ్‌ల్లో అత‌డితో పూర్తిగా ఒక్క ఓవ‌ర్ కూడా వేయించ‌లేదు.

కేకేఆర్‌తో మ్యాచ్‌లో కూడా జడేజా అద్బుత ప్రదర్శన కనబరిచాడు. మూడు ఓవర్లు వేసిన జడేజా, కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికి అతడితో నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయించలేదు. ఈ నేపథ్యంలో రాజస్తాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై భారత మాజీ స్పి‍న్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. జడేజాలాంటి సీనియర్ స్పిన్నర్‌తో పూర్తి కోటాను పూర్తి చేయించకపోవడాన్ని అశ్విన్ తప్పుబట్టాడు.

"రవీంద్ర జడేజా రూపంలో అద్భుతమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మీ జట్టులో ఉన్నాడు. అతడి గణంకాలను చూస్తే ఎలాంటి బౌలరో మీకే ఆర్ధమవుతోంది. కేకేఆర్ మ్యాచ్‌లో జడ్డూ మూడు ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్‌లో రింకూ సింగ్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

అయినప్పటికి అతడితో మరో ఓవర్ వేయించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్నారని బహుశా జడేజాకు బౌలింగ్ ఇవ్వలేదనుకుంటా. రవి బిష్ణోయ్ వంటి రైట్ ఆర్మ్ లెగ్ బౌలర్ అయితే బాగా బౌలింగ్ చేస్తాడని కెప్టెన్ ఆశించాడు. కానీ చివరి ఏమి జరిగింది. బిష్ణోయ్ వేసిన ఒకే ఓవర్‌లో 19 పరుగులు వచ్చాయి. దీని బట్టి జడేజా బౌలింగ్‌పై మీకు నమ్మకం లేదని నాకు ఆర్ధమైంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
చదవండి: BCCI: వైభ‌వ్ సూర్య‌వంశీకి బిగ్‌ ప్ర‌మోష‌న్‌!
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)