Breaking News

టీమిండియాపై గెల‌వ‌డం అంత ఈజీ కాదు: పాక్‌ మాజీ కెప్టెన్‌

Published on Tue, 08/05/2025 - 16:52

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌నను విజ‌య‌వంతంగా ముగించిన టీమిండియా.. ఇక ఆసియాక‌ప్‌-2025కు సిద్దం కానుంది.  ఈ ఖండాంతర మెగా టోర్నీ సెప్టెంబ‌ర్ 9 నుంచి యూఏఈ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ ఆసియా సింహాల పోరు కోసం భార‌త జ‌ట్టును బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది. భార‌త్ త‌మ తొలి మ్యాచ్‌లో సెప్టెంబ‌ర్ 10న దుబాయ్ వేదిక‌గా త‌ల‌ప‌డ‌నుంది.

ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 14న అదే దుబాయ్ అంత‌ర్జాతీయ మైదానంలో చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్‌తో తాడోపేడో తెల్చుకోనుంది. పెహాల్గమ్‌ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బ‌హిష్క‌రించాల‌ని కొంత‌మంది అంటుంటే.. మ‌రి కొంత‌మంది దాయాదిని చిత్తు ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

ఏదేమైన‌ప్ప‌టికి క్రికెట్ ప్ర‌పంచంలో పాకిస్తాన్‌-భార‌త్ మ్యాచ్ ఉన్న క్రేజే వేరు. దాయాదుల పోరు రోజును అభిమానులు టీవీల‌కు అతుక్కుపోవాల్సిందే. ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్ జ‌ట్టుపై మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. టీమిండియాతో పోలిస్తే త‌మ జ‌ట్టు చాలా బల‌హీనంగా ఉంద‌ని, ఇటీవ‌లే పాక్ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌పై అత‌డు ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. పాకిస్తాన్ ప్ర‌స్తుతం విండీస్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది. ఆతిథ్య జ‌ట్టుతో టీ20 సిరీస్‌ను పాక్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కానీ అంత‌కుముందు బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను మాత్రం 1-2 తేడాతో మెన్ ఇన్ గ్రీన్ కోల్పోయింది.

"ఆసియాక‌ప్‌లో బ‌లమైన భార‌త జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌డం పాకిస్తాన్‌కు అంత సులువు కాదు. మా జ‌ట్టు ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా రాణించ‌లేక‌పోతుంది. ఎప్పుడు లేని విధంగా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. పాక్ జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందో ఈ సిరీస్ ఫ‌లితం బ‌ట్టి ఆర్ధం చేసుకోవ‌చ్చు.

ఆ త‌ర్వాత వెస్టిండీస్‌లో కూడా ఓ మ్యాచ్ ఓడిపోయారు. స‌ల్మాన్ అలీ అఘా కెప్టెన్‌గా స‌రైనోడే. కానీ మూడు ఫార్మాట్ల‌లో జ‌ట్టును న‌డిపించ‌డం అంత ఈజీ కాదు. మా ద‌గ్గ‌ర అద్బుత‌మైన ప్ర‌తిభావంతులైన ఆట‌గాళ్లు ఉన్నారు. కానీ వారిని స‌రిగ్గా ఉప‌యోగించుకోవ‌డంలో పాక్ క్రికెట్ బోర్డు విఫ‌ల‌మ‌వుతోంది" అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో లతీఫ్ పేర్కొన్నాడు.
చదవండి: ఇక్కడున్నా బిర్యానీ తక్కువే.. ఆ ఫుడ్‌ అసలే తినడు: సిరాజ్‌ సోదరుడు
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)