భీకర ఫామ్‌.. ఈసారి డబుల్‌ సెంచరీ

Published on Mon, 02/16/2026 - 13:13

రంజీ ట్రోఫీ ఎలైట్‌ 2025-26 సెమీ ఫైనల్లో కర్ణాటక కెప్టెన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ డబుల్‌ సెంచరీతో మెరిశాడు. 

రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో తొలి సెమీస్‌ మ్యాచ్‌లో కర్ణాటక- ఉత్తరాఖండ్‌ (karnataka vs uttarakhand) తలపడుతున్నాయి. లక్నో వేదికగా ఇరుజట్ల మధ్య ఆదివారం మ్యాచ్‌ మొదలుకాగా.. మాజీ చాంపియన్‌ కర్ణాటక కర్ణాటక భారీ స్కోరు దిశగా సాగుతోంది.

తొలిరోజే ఆధిపత్యం
ఇక ఈ దేశీ ఫస్ట్‌క్లాస్‌ టోర్నీ తొలిసారి సెమీఫైనల్‌ చేరిన ఉత్తరాఖండ్‌ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 355 పరుగులు సాధించింది. టీమిండియా స్టార్లు కేఎల్‌ రాహుల్‌ (KL Rahul- 141; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు), కెప్టెన్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (148 బ్యాటింగ్‌; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో అదరగొట్టారు.

ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (Mayank Agarwal- 5) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా... రాహుల్, పడిక్కల్‌ రెండో వికెట్‌కు 278 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. రాహుల్‌ అవుటయ్యాక వచ్చిన కరుణ్‌ నాయర్‌ (37 బ్యాటింగ్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా నిలకడ కనబరిచాడు.

రెండో రోజు కెప్టెన్‌ డబుల్‌ సెంచరీ పూర్తి
ఈ నేపథ్యంలో 355/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన కర్ణాటక.. 125 ఓవర్లు పూర్తయ్యేసరికి ఐదు వికెట్ల నష్టానికి 512 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ పడిక్కల్‌ 330 బంతుల్లో 29 ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 232 పరుగులు చేశాడు.

పడిక్కల్‌ ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో డబుల్‌ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక కరుణ్‌ నాయర్‌ అర్ధ శతకం (105 బంతుల్లో 60) బాదగా.. శ్రేయస్‌ గోపాల్‌ డకౌట్‌ (0) అయ్యాడు. మిగిలిన వారిలో స్మరణ్‌ రవిచంద్రన్‌ 33, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కృతిక్‌ క్రిష్ణ 15 పరుగులతో క్రీజులో నిలిచారు. ఉత్తరాఖండ్‌ బౌలర్లలో ఆదిత్యా రావత్‌ మూడు వికెట్లు తీయగా.. అభయ్‌ నేగి, లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందాని తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తున్న పడిక్కల్‌
టీమిండియాకు దూరమైన పడిక్కల్‌ దేశీ క్రికెట్‌లో  దుమ్ములేపుతున్నాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో  పుదుచ్చేరి, త్రిపుర జట్లపై వరుస శతకాలు బాదిన ఈ కర్ణాటక స్టార్‌.. అనంతరం రాజస్తాన్‌ (91), ముంబై (81 నాటౌట్‌) జట్లపై కూడా రాణించాడు. ఇక రంజీ ఎడిషన్‌లో చివరగా పంజాబ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన పడిక్కల్‌.. తాజాగా సెమీ ఫైనల్లో ఉత్తరాఖండ్‌పై ‘ద్వి’శతక్కొట్టం విశేషం.

చదవండి: IND vs PAK: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్‌ కెప్టెన్‌

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)