Breaking News

శార్దూల్‌, హిమాన్షు శతకాలు.. ముంబై, మధ్యప్రదేశ్‌ పైచేయి

Published on Sun, 03/03/2024 - 18:10

రంజీ ట్రోఫీ 2024 సెమీఫైనల్స్‌లో ముంబై, మధ్యప్రదేశ్‌ జట్లు పైచేయి సాధించాయి. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఈ రెండు జట్లు.. తమతమ ప్రత్యర్దుల కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. ముంబై తమిళనాడుపై.. మధ్యప్రదేశ్‌ విదర్భపై ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి.

హిమాన్షు సూపర్‌ సెంచరీ..
నాగ్‌పూర్‌లో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో విదర్భ రెండో రోజు ఆట ముగిసే సమయానికి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 13 పరుగులు చేసింది. ఈ జట్టు మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 69 పరుగులు వెనుకపడి ఉంది. అథర్వ తైడే (2) ఔట్‌ కాగా.. దృవ్‌ షోరే (10), అక్షయ్‌ వాఖరే (1) క్రీజ్‌లో ఉన్నారు. 

అంతకుముందు హిమాన్షు మంత్రి (126) సూపర్‌ సెంచరీతో కదంతొక్కడంతో మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది. హిమాన్షు​ మినహా మధ్యప్రదేశ్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు.

ఉమేశ్‌ యాదవ్‌ (3/40), యశ్‌ ఠాకూర్‌ (3/51), వాఖరే (2/68), సర్వటే (1/48) మధ్యప్రదేశ్‌ పతనాన్ని శాశించారు. దీనికి ముందు ఆవేశ్‌ ఖాన్‌ (4/49) విజృంభించడంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. కరుణ్‌ నాయర్‌ (63) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

శతక్కొట్టిన శార్దూల్‌..
ముంబై వేదికగా తమిళనాడుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ముంబై ఆధిక్యత ప్రదర్శిస్తుంది. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దూల్‌ (109) మెరుపు శతకంతో విరుచుకుపడటంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 10, 11 స్థానాల్లో వచ్చి సెంచరీలతో (క్వార్టర్‌ ఫైనల్స్‌లో) సంచలనం సృష్టించిన తనుశ్‌ కోటీయన్‌ (74), తుషార్‌ దేశ్‌ పాండే (17) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ముంబై 207 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. సాయికిషోర్‌ ఆరేసి (6/97) ముంబైను దెబ్బకొట్టాడు.

అంతకుముందు తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో తమిళనాడు ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. తుషార్‌ దేశ్‌ పాండే 3, ముషీర్‌ ఖాన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, తనుశ్‌ కోటియన్‌ తలో 2 వికెట్లు, మోహిత​్‌ అవస్థి ఓ వికెట్‌ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో విజయ్‌ శంకర్‌ (44), వాషింగ్టన్‌ సుందర్‌ (43) కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)