Breaking News

జ్ఞానేశ్వర్‌, భరత్‌ అర్ధ శతకాలు.. కోలుకున్న ఆంధ్ర జట్టు.. ఇక సౌరాష్ట్ర

Published on Thu, 01/05/2023 - 09:38

Ranji Trophy 2022- 23 Andhra vs Hyderabad- సాక్షి, విజయనగరం: హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘బి’ లీగ్‌ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు కోలుకుంది. 62 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆంధ్ర జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 230 పరుగులు సాధించింది. తద్వారా తమ ఆధిక్యాన్ని 168 పరుగులకు పెంచుకుంది.

సీఆర్‌ జ్ఞానేశ్వర్‌ (96 బంతుల్లో 72; 15 ఫోర్లు), కెప్టెన్‌ హనుమ విహారి (33; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కోన శ్రీకర్‌ భరత్‌ (52 బంతుల్లో 70 బ్యాటింగ్‌; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), రికీ భుయ్‌ (51 బంతుల్లో 43 బ్యాటింగ్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) బాధ్యతాయుత ఆటతీరుతో ఆంధ్ర జట్టును నిలబెట్టారు. ఆంధ్ర కోల్పోయిన మూడు వికెట్లను హైదరాబాద్‌ బౌలర్‌ రక్షణ్‌ రెడ్డి పడగొట్టాడు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 79/3తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ మరో 118 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయి 197 పరుగులవద్ద ఆలౌటై 62 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించింది.

శశాంక్‌ (55 బంతుల్లో 47; 4 ఫోర్లు, 1 సిక్స్‌) హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి (4/64), కేవీ శశికాంత్‌ (3/40), సుదర్శన్‌ (2/47) విజృంభించి హైదరాబాద్‌ను 200 స్కోరులోపు కట్టడి చేశారు.  

సౌరాష్ట్ర 503/6 
రాజ్‌కోట్‌: ఢిల్లీతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో సౌరాష్ట్ర 370 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 184/1తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌరాష్ట్ర రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 503 పరుగులు సాధించింది. అర్పిత్‌ (127 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌), హార్విక్‌ దేశాయ్‌ (107; 15 ఫోర్లు) సెంచరీలు సాధించారు. తొలి రోజు జైదేవ్‌ ఉనాద్కట్‌ (8/39) ధాటికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 133  పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

చదవండి: Ind Vs SL: సంజూ స్థానంలో జితేశ్‌ శర్మ.. ఉమ్రాన్‌కు బదులు అర్ష్‌దీప్‌! అక్కడ చెరో విజయం  
Hardik Pandya: మేము ఓడిపోయినా పర్లేదనుకున్నా! అందుకే ఇలా.. పాండ్యా కామెంట్స్‌ వైరల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)