Breaking News

అభిరథ్ రెడ్డి, హిమతేజ సెంచరీలు

Published on Sat, 01/31/2026 - 08:54

సాక్షి, హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌తో జింఖానా మైదానంలో రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 56/0తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన హైదరాబాద్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 105 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 415 పరుగులు చేసింది. 

ఓపెనర్‌ అభిరథ్‌ రెడ్డి (121; 16 ఫోర్లు, 1 సిక్స్‌), మిడిలార్డర్‌ బ్యాటర్‌ కొడిమెల హిమతేజ (125 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) సెంచరీలు సాధించారు. అమన్‌ రావు (52; 8 ఫోర్లు, 1 సిక్స్‌)తో తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించిన అభిరథ్‌... మూడో వికెట్‌కు హిమతేజతో 147 పరుగులు జత చేశాడు. ప్రజ్ఞయ్‌ రెడ్డి (52 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), హిమతేజ ఐదో వికెట్‌కు అజేయంగా 91 పరుగులు జోడించాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్‌ 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

ఆంధ్ర 267/5 
నాగాలాండ్‌ జట్టుతో సొవిమాలో జరుగుతున్న గ్రూప్‌ ‘ఎ’ రంజీ ట్రోఫీ లీగ్‌ మ్యాచ్‌లో... రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. అభిషేక్‌ రెడ్డి (51; 7 ఫోర్లు), కరణ్‌ షిండే (51; 5 ఫోర్లు, 1 సిక్స్‌), సీఆర్‌ జ్ఞానేశ్వర్‌ (87 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. 

ప్రస్తుతం నాగాలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 366కు ఆంధ్ర మరో 99 పరుగుల దూరంలో ఉంది. జ్ఞానేశ్వర్‌తో కలిసి శశికాంత్‌ (31 బ్యాటింగ్‌; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు.    

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)