Breaking News

రాణించిన జైస్వాల్‌.. దీపక్‌ హుడా అజేయ శతకం

Published on Sun, 11/02/2025 - 19:11

రంజీ ట్రోఫీ 2025-26లో (Ranji Trophy) భాగంగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆటగాడు దీపక్‌ హుడా (Deepak Hooda) సెంచరీతో కదంతొక్కాడు. 159 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 121 పరగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 

హుడా సెంచరీ సాయంతో రాజస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్‌ 4 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. దీపక్‌ హుడాకు జతగా కార్తిక్‌ శర్మ (26) క్రీజ్‌లో ఉంది. 

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌లో సచిన్‌ యాదవ్‌ (92) తృటిలో సెంచరీని మిస్‌ చేసుకున్నాడు. కెప్టెన్‌ మహిపాల్‌ లోమ్రార్‌ (41) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించాడు. అభిజీత్‌ తోమర్‌ 14, కునాల్‌ సింగ్‌ 31 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే 2, షమ్స్‌ ములానీ ఓ వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం రాజస్థాన్‌ 85 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది

రాణించిన జైస్వాల్‌
అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) (67), ముషీర్‌ ఖాన్‌ (49) రాణించగా.. మిడిలార్డర్‌ విఫలమైంది. రహానే 3, సిద్దేశ్‌ లాడ్‌ 8, సర్ఫరాజ్‌ ఖాన్‌ 15, ఆకాశ్‌ ఆనంద్‌ 5 పరుగులకు ఔటయ్యారు. 

లోయర్డార్‌ ఆటగాళ్లలో షమ్స్‌ ములానీ (32), కెప్టెన్‌ శార్దూల్‌ ఠాకూర్‌ (18), హిమాన్షు సింగ్‌ (25), తుషార్‌ దేశ్‌పాండే (25 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాజస్థాన్‌ బౌలర్లలో కుక్నా సింగ్‌ 4 వికెట్లు పడగొట్టగా.. ఆశోక్‌ శర్మ 3, అనికేత్‌ చౌదరీ, ఆకాశ్‌ సింగ్‌, రాహుల్‌ చాహర్‌ తలో వికెట్‌ తీశారు. ​

చదవండి: శివాలెత్తిన గుర్బాజ్‌.. ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)