Breaking News

సత్తా చాటిన కేఎల్‌ రాహుల్‌

Published on Fri, 01/30/2026 - 15:16

టీమిండియా మోస్ట్‌ ప్రామిసింగ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ దేశవాలీ క్రికెట్‌లోనూ సత్తా చాటుతున్నాడు. జాతీయ విధులకు దూరంగా ఉండటంతో రంజీ బాట బట్టిన ఈ కర్ణాటక వికెట్‌కీపర్‌ బ్యాటర్‌.. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87 బంతుల్లో 59; 9 ఫోర్లు) మెరిశాడు. క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాలంటే కర్ణాటక ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలి.

కీలకమైన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్‌.. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. రాహుల్‌, మయాంక్‌ రాణించినా, ఈ మ్యాచ్‌లో కర్ణాటక ఎదురీదుతోంది. 

రెండో రోజు టీ విరామం సమయానికి సగం​ వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు చేరుకోవాలంటే ఇంకా 110 పరుగులు చేయాల్సి ఉంది.

శ్రేయస్‌ గోపాల్‌ (17), కృతిక్‌ కృష్ణ (20) కర్ణాటకను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్‌ ఔటయ్యాక కర్ణాటక స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌తో కెప్టెన్‌గా అరంగేట్రం చేసిన దేవదత్‌ పడిక్కల్‌, స్మరణ్‌ రవిచంద్రన్‌ తలో 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. 

వన్‌డౌన్‌లో వచ్చిన కేవీ అనీశ్‌ (32) క్రీజ్‌లో కుదురుకున్న సమయంలో ఔటయ్యాడు. హర్ప్రీత్‌ బ్రార్‌ 4 వికెట్లు తీసి కర్ణాటకను దారుణంగా దెబ్బకొట్టాడు. ఎమన్‌జోత్‌ సింగ్‌ చహల్‌ కీలకమైన మయాంక్‌ అగర్వాల్‌ వికెట్‌ తీశాడు.

అంతకుముందు పంజాబ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ అభిజీత్‌ గార్గ్‌ (81), ఎమన్‌జోత్‌ సింగ్‌ చహల్‌ (83) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్‌ ఉదయ్‌ సహారన్‌ (44) ఓ మోస్తరుగా రాణించగా.. అన్మోల్‌ మల్హోత్రా (25), ఆయుశ్‌ గోయల్‌ (23), సుఖ్‌దీప్‌ బజ్వా (20) రెండంకెల స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్‌ పాటిల్‌ 4, శ్రేయస్‌ గోపాల్‌ 3, మొహిసిన్‌ ఖాన్‌ 2, ప్రసిద్ద్‌ కృష్ణ ఓ వికెట్‌ తీశారు. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)