ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్
Breaking News
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
సెమీస్‌కు చేరువలో ఆంధ్ర..
Published on Mon, 02/26/2024 - 07:10
ఇండోర్: రంజీ ట్రోఫీ క్రికెట్ టోరీ్నలో సెమీఫైనల్ బెర్త్‌కు ఆంధ్ర జట్టు మరో 75 పరుగుల దూరంలో ఉంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసింది. హనుమ విహారి (43 బ్యాటింగ్), కరణ్ షిండే (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన మధ్యప్రదేశ్ 40.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లు నితీశ్ కుమార్ రెడ్డి (4/28), శశికాంత్ (3/20), లలిత్ మోహన్ (3/20) మధ్యప్రదేశ్‌ను దెబ్బ తీశారు.
#
Tags : 1