డబుల్ సెంచరీతో చెల‌రేగిన ఆర్సీబీ కెప్టెన్.. కెరీర్‌లో తొలి సారి

Published on Fri, 10/17/2025 - 14:01

దేశ‌వాళీ క్రికెట్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ కెప్టెన్‌, టీమిండియా ఆట‌గాడు ర‌జ‌త్ పాటిదార్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజ‌న్‌లో భాగంగా ఇండోర్ వేదిక‌గా పంజాబ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో పాటిదార్ డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు.

పాటిదార్ 330 బంతుల్లో 26  ఫోర్ల సాయంతో తొలి ఫ‌స్ట్ క్లాస్ డ‌బుల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 107 ప‌రుగుల ఓవ‌ర్ నైట్ స్కోర్‌తో త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈ ఆర్సీబీ కెప్టెన్‌.. ఆచితూచి ఆడుతూ మూడంకెల ఫిగ‌ర్‌ను సాధించాడు.

ఇప్పటివరకు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 196గా ఉండేది. ఈ ఎంపీ కెప్టెన్ 203 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నాడు. అత‌డి ద్విశ‌త‌కం ఫ‌లితంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ జ‌ట్టు 145 ఓవ‌ర్లు ముగిసే స‌రికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల న‌ష్టానికి 489 ప‌రుగులు చేసింది. ఎంపీ టీమ్ ప్ర‌స్తుతం 257 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడా?
ఇటీవల కాంలో పటిదార్ దుమ్ములేపుతున్నాడు. గత 8 ఇన్నింగ్స్‌ల్లో అతడు సాధించిన స్కోర్లు ఇవే 100*(160), 10(25), 66(132), 13(27), 101(115), 77(84), 66(72) & 203*(332). పాటిదార్ ఇదే ఫామ్‌ను కొన‌సాగిస్తే భార‌త టెస్టు జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశ‌ముంది. 

పాటిదార్ గ‌తేడాది ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని అందుపుచ్చుకోలేక‌పోయాడు. భార‌త్ త‌ర‌పున మూడు టెస్టుల్లో కేవ‌లం 63 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.దీంతో అత‌డిని జ‌ట్టు నుంచి త‌ప్పించారు. ఇప్పుడు మ‌ళ్లీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో మెరుగ్గా రాణించి టీమిండియాలోకి తిరిగి రావాల‌ని ప‌ట్టుద‌ల‌తో పాటిదార్ ఉన్నాడు.
చదవండి: IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా?
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)