Breaking News

'ఆర్సీబీలోకి రావడమే ఇష్టం లేదు'

Published on Mon, 06/08/2026 - 18:35

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును(ఆర్సీబీ) వ‌రుస‌గా రెండుసార్లు చాంపియ‌న్‌గా నిలిపిన అరుదైన కెప్టెన్‌గా ర‌జ‌త్ పాటీదార్ నిలిచాడు. వ‌రుస‌గా ఒక జట్టుకు రెండు టైటిల్స్ అందించిన కెప్టెన్ల జాబితాలోనూ (ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మ‌) పాటీదార్ చోటు ద‌క్కించుకున్నాడు. 

తాజాగా పాటీదార్ మొద‌ట్లో త‌న‌కు ఆర్సీబీకి ఆడ‌డం ఇష్టం ఉండేది కాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. యూట్యూబ్ చానెల్‌లో రోటోరిస్ సిరీస్‌లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో పాటీదార్ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. 2021లో ఆర్సీబీ జ‌ట్టులో చేరిన త‌న‌ను మొద‌ట ఒక ప్ర‌త్యామ్నాయ ఆట‌గాడిగా మాత్ర‌మే చూశార‌ని, అదే స‌మయంలో త‌న పెళ్లి ఉండ‌డంతో మొద‌ట ఆర్సీబీలో చేరేందుకు ఇష్టప‌డ‌లేద‌ని వెల్ల‌డించాడు. 

పాటీదార్ మాట్లాడుతూ.. ‘నేను చెప్పింది నిజ‌మే. ఆర్సీబీ జ‌ట్టులోకి రావడం ఇష్టం లేదు. ఎందుకంటే నేను తొలిసారి ఆ జ‌ట్టులోకి వ‌చ్చిన స‌మ‌ యంలో ప్ర‌త్యామ్నాయంగానే చూశారు. తుది జ‌ట్టులో చోటు ఇవ్వ‌ర‌న్న విష‌యం క్లారిటీ ఉండ‌డంతో ఆర్సీబీకి ఆడేందుకు సంకోచించాను. ఆర్సీబీలో జాయిన అయిన మొద‌ట్లో కూడా అలాంటి సంకేతాలే వ‌చ్చాయి. 

మేము నిన్ను ప్ర‌త్యామ్నాయంగా మాత్ర‌మే తీసుకున్నాం. కాబ‌ట్టి ప్ర‌శాంతంగా ఉండు. ఎవ‌రైనా గాయ‌ప‌డితే నీకు అవ‌కాశం వ‌స్తుంది అని ఆర్సీబీ యాజ‌మాన్యం క్లియ‌ర్‌గా చెప్పింది. దీంతో ఆర్సీబీలోకి రావడానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఎందుకంటే అదే స‌మ‌యంలో నా పెళ్లి కూడా ఫిక్స్ అయింది. ఒక‌వేళ ఆర్సీబీలోకి వ‌చ్చినా బెంచ్‌కే ప‌రిమితం కావాల్సి వ‌చ్చేది’ అని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2021 సీజ‌న్‌కు ముందు జ‌రిగిన మినీ వేలంలో పాటిదార్‌ను ఆర్సీబీ రూ.20 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. కానీ ఆ సీజ‌న్‌లో పెద్ద‌గా ఆడే అవ‌కాశం రాని పాటీదార్ నాలుగు మ్యాచ్‌ల్లో 71 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. 2022 ఐపీఎల్ మెగావేలంలో పాటీదార్‌ను ఎవ‌రూ కొనుగోలు చేయ‌లేదు. అయితే సీజ‌న్ మ‌ధ్య‌లో ల‌వ్నిత్ సిసోడియా గాయ‌ప‌డ‌డంతో అత‌డి స్థానంలో పాటీదార్‌ను తీసుకుంది. 

ఈసారి పాటీదార్ త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని పూర్తిగా స‌ద్వినియోగం చేసుకున్నాడు. ఆ సీజ‌న్ ఎలిమినేట‌ర్‌లో ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌లో పాటీదార్ అజేయ సెంచ‌రీ ( 112 ప‌రుగులు నాటౌట్‌) సంచ‌ల‌న ఇన్నింగ్స్‌తో అంద‌రి దృష్టిలో ప‌డ్డాడు. ఆ త‌ర్వాత పాటీదార్ వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. 

ఐపీఎల్ 2025 మెగావేలం త‌ర్వాత ఆర్సీబీ పాటీదార్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. కెప్టెన్‌గా తొలి సీజ‌న్‌లోనే పాటీదార్ ఆర్సీబీని చాంపియ‌న్‌గా నిలిపాడు. తాజాగా ఈ సీజ‌న్‌లోనూ మ‌రోసారి ఆర్సీబీని చాంపియ‌న్‌గా నిలిపి ల‌క్కీ కెప్టెన్ అయిపోయాడు. పాటీదార్ కెప్టెన్‌గానే గాక బ్యాట‌ర్‌గాను అద‌ర‌గొట్టాడు. ఈ సీజ‌న్‌లో పాటీదార్ 15 మ్యాచ్‌ల్లో 501 ప‌రుగులు సాధించాడు.

చదవండి: రిటైర్డ్ హర్ట్‌, రిటైర్డ్ ఔట్ విన్నాం.. ఆబ్సెంట్ హర్ట్ అంటే?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)