Breaking News

IND VS BAN: మూడో టీ20కి వర్షం​ ముప్పు..?

Published on Sat, 10/12/2024 - 14:55

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య హైదరాబాద్‌ వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 12) జరగాల్సిన మూడో టీ20కి వర్షం​ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు సంభవించవచ్చని వారు పేర్కొన్నారు. నగరంలో ఇవాళ సాయంత్రం ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడవచ్చని అంచనా.

నిన్న సాయంత్రం కూడా నగరంలో భారీ వర్షం కురిసింది. నిన్నటి నుంచి మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ఈ మ్యాచ్‌ రద్దైనా టీమిండియాకు ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. హైదరాబాద్‌ అభిమానులు మాత్రం చాలా నిరాశ చెందుతారు. ఈ మ్యాచ్‌ కోసం నగర వాసులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. గ్వాలియర్‌లో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో నెగ్గిన భారత్‌.. న్యూఢిల్లీ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో 86 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. వర్షం నుంచి ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుంటే ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.  

చదవండి: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌.. భారత జట్టు ప్రకటన

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)