Breaking News

ఇండియా, సౌతాఫ్రికా తొలి టీ20కి వర్షం ముప్పు..?

Published on Fri, 11/08/2024 - 16:47

నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌, సౌతాఫ్రికా జట్లు ఇవాళ (నవంబర్‌ 8) తొలి మ్యాచ్‌లో తలపడనున్నాయి. డర్బన్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని యాక్యూవెదర్‌ పేర్కొంది. మ్యాచ్‌ జరిగే సమయంలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని సమాచారం​. మ్యాచ్‌ ప్రారంభ సమయానికి 46 శాతం వర్షం పడే సూచనలు ఉన్నట్లు యాక్యూవెదర్‌ తెలిపింది. 

మ్యాచ్‌ జరిగే సమయంలో ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనున్నట్లు తెలుస్తుంది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో వర్షం పడే అవకాశాలు 51 శాతానికి పెరుగుతాయని సమాచారం​. ఇవాళ ఉదయం నుంచి డర్బన్‌లో ఆకాశం మేఘావృతమై ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే నేటి మ్యాచ్‌కు వర్షం అంతరాయాలు తప్పేలా లేవు.

కాగా, భారత్‌-సౌతాఫ్రికా చివరి సారి టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. నాటి ఫైనల్లో భారత్‌.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. పొట్టి ప్రపంచ కప్‌ అనంతరం భారత్‌ టీ20ల్లో తిరుగులేని జట్టుగా ఉంది. సూర్యకుమార్‌ నేతృత్వంలో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. శ్రీలంకను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. తాజాగా బంగ్లాదేశ్‌ను సైతం మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో క్లీన్‌ స్వీప్‌ చేసింది. 

దక్షిణాఫ్రికా విషయానికొస్తే.. ప్రొటీస్‌ జట్టు పసికూన ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసుకుంది. జట్ల బలాబలాల ప్రకారం చూస్తే.. ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో స్టార్‌ హిట్లర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా జట్టులో క్లాసెన్‌, మిల్లర్‌, మార్క్రమ్‌ ఉండగా.. టీమిండియాలో సూర్యకుమార్‌ యాదవ్‌, సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా లాంటి భారీ హిట్టర్లు ఉన్నారు. ఐపీఎల్‌ మెగా వేలం నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్‌లో రాణించిన ఆటగాళ్లపై ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు కన్నేసే అవకాశం ఉంది. కాబట్టి ఇరు జట్ల ఆటగాళ్లు పోటీపడి సత్తా చాటాలని భావిస్తారు.

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)