Breaking News

ద్రవిడ్‌ కొడుకుకు సూపర్‌ ఆఫర్‌

Published on Fri, 07/26/2024 - 09:35

టీమిండియా తాజా మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పెద్ద కొడుకు సమిత్‌ ద్రవిడ్‌కు బంపరాఫర్‌ లభించింది. కర్ణాటక టీ20 లీగ్‌ (కేఎస్‌సీఏ టీ20 టోర్నీ) వేలంలో సుమిత్‌ను గత సీజన్‌ రన్నరప్‌ మైసూరు వారియర్స్‌  సొంతం చేసుకుంది. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన సమిత్‌ను రూ. 50000 సొంతం చేసుకున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది.

18 ఏళ్ల సమిత్‌ ఇప్పటివరకు సీనియర్‌ స్థాయి క్రికెట్‌ ఆడలేదు. సీనియర్లతో కలిసి ఆడేందుకు సమిత్‌కు ఇది మంచి అవకాశం. సమిత్‌ను కొనుగోలు చేసిన మైసూరు జట్టుకు టీమిండియా ట్రిపుల్‌ సెంచూరియన్‌ కరుణ్‌ నాయర్‌ సారథ్యం వహించనున్నాడు. ఇదే జట్టులో టీమిండియా పేసర్‌ ప్రసిద్ద్‌ కృష్ణ ఉన్నాడు. వీరి సహవాసంలో సమిత్‌ మరింత రాటుదేలే అవకాశం ఉంది.  

ప్రస్తుత సీజన్‌ కూచ్‌ బెహర్‌ ట్రోఫీ గెలిచిన కర్ణాటక అండర్‌-19 జట్టులో సమిత్‌ సభ్యుడిగా ఉన్నాడు. మిడిలార్డర్‌లో ఉపయోకరమైన బ్యాటర్‌గా పేరున్న సమిత్‌ ఇటీవలి కాలంలో అద్బుతంగా ఆడుతూ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌ కౌంటీ జట్టు లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సమిత్‌ పర్వాలేదనిపించాడు.

ఇదిలా ఉంటే, సమిత్‌ తండ్రి రాహుల్‌ ద్రవిడ్‌ ఇటీవలే టీమిండియాను టీ20 వరల్డ్‌కప్‌ గెలిపించి హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకున్నాడు. ద్రవిడ్‌ సుమారు రెండున్నర సంవత్సరాల పాటు భారత హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. ద్రవిడ్‌ స్థానంలో టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ ఎంపికయ్యాడు. గంభీర్‌ ఆథ్వర్యంలో టీమిండియా రేపటి నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడనుంది.

మైసూర్ వారియర్స్ జట్టు:
కరుణ్ నాయర్, కార్తీక్ సీఏ, మనోజ్ భండగే, కార్తీక్ ఎస్‌యూ, సుచిత్ జే, గౌతమ్ కే, విద్యాధర్ పాటిల్, వెంకటేష్ ఎం, హర్షిల్ ధర్మాని, గౌతమ్ మిశ్రా, ధనుష్ గౌడ, సమిత్ ద్రవిడ్, దీపక్ దేవాడిగ, సుమిత్ కుమార్, స్మయన్ శ్రీవాస్తవ, జాస్పర్ ఈజే, ప్రసిద్ధ్ కృష్ణ , మహమ్మద్ సర్ఫరాజ్ అష్రఫ్.
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)