Breaking News

రాజస్తాన్‌ రాయల్స్‌ కీలక ప్రకటన.. ద్రవిడ్‌ గుడ్‌బై

Published on Sat, 08/30/2025 - 13:55

ఐపీఎల్‌-2026 (IPL 2026) టోర్నమెంట్‌కు ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. తమ జట్టు హెడ్‌కోచ్‌ పదవి నుంచి రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) తప్పుకొంటున్నట్లు తెలిపింది. 

రాహుల్‌కు ధన్యవాదాలు
ఈ మేరకు.. ‘‘ఎన్నో ఏళ్లుగా రాయల్స్‌ ‍ప్రయాణంలో రాహుల్‌ భాగంగా ఉన్నారు. ఆయన నాయకత్వం, అనుభవం యువ ఆటగాళ్లను ఎంతగానో ప్రభావితం చేశాయి. జట్టును విలువలతో కూడినదిగా.. పటిష్టంగా మార్చడంలో ఆయన ముద్ర ఉంది.

కోచ్‌గా ఈ ఫ్రాంఛైజీ మీద రాహుల్‌ బలమైన ముద్ర వేశారు. జట్టు నిర్మాణంలో భాగంగా రాహుల్‌కు మరో పదవిని ఫ్రాంఛైజీ ఆఫర్‌ చేసింది. కానీ ఆయన దానిని స్వీకరించేందుకు సిద్ధంగా లేరు.

రాజస్తాన్‌ రాయల్స్‌, మా జట్టు ఆటగాళ్లు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది రాయల్స్‌ అభిమానుల తరఫున రాహుల్‌కు ధన్యవాదాలు. ఈ ఫ్రాంఛైజీ కోసం ఎనలేని సేవలు అందించిన రాహుల్‌కు కృతజ్ఞతలు’’ అంటూ రాజస్తాన్‌ రాయల్స్‌ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది.

కెప్టెన్‌గానూ...
ఐపీఎల్‌లో 2012, 2013 సీజన్లలో రాహుల్‌ ద్రవిడ్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా పనిచేశాడు. ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం అదే ఫ్రాంఛైజీకి రెండేళ్లు మెంటార్‌నూ వ్యవహరించాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో జట్టు కట్టిన ద్రవిడ్‌.. అనంతరం జాతీయ క్రికెట్‌ అకాడమీ హెడ్‌గా వెళ్లడంతో క్యాష్‌ రిచ్‌ లీగ్‌కు దూరమయ్యాడు.

ప్రధాన కోచ్‌గా
ఈ క్రమంలోనే టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్‌.. 2024లో భారత్‌ను టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం హెడ్‌కోచ్‌ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్న ద్రవిడ్‌.. ఈ ఏడాది రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు.

అయితే, ద్రవిడ్‌ మార్గదర్శనంలో రాయల్స్‌ ఈసారి అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

సంజూ- ద్రవిడ్‌ మధ్య విభేదాలు?
కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడం.. అతడి స్థానంలో వచ్చిన రియాన్‌ పరాగ్‌ సారథిగా సక్సెస్‌ కాకపోవడం తీవ్ర ప్రభావం చూపాయి. అంతేకాదు.. సంజూ- ద్రవిడ్‌ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే సంజూ రాయల్స్‌ను వీడి వేరే ఫ్రాంఛైజీలో చేరనున్నాడనే వదంతులు పుట్టుకొచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో ద్రవిడ్‌ తన పదవి నుంచి వైదొలగడం గమనార్హం. తాము ఆఫర్‌ చేసిన పదవిని ద్రవిడ్‌ కాదన్నాడని.. అందుకే తప్పుకొన్నాడని రాయల్స్‌ స్వయంగా చెప్పడం విశేషం.

చదవండి: 'నా కెరీర్‌లో సెహ్వాగ్ త్యాగం మరువలేనిది.. ఎప్పుడూ రుణపడి ఉంటా'

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)