కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టుకున్న టీమిండియా ప్లేయర్‌.. వీడియో

Published on Sun, 10/27/2024 - 16:30

మహిళల క్రికెట్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ (అక్టోబర్‌ 27) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఓ సెన్సేషన్‌ క్యాచ్‌ నమోదైంది. టీమిండియా ప్లేయర్‌ రాధా యాదవ్‌ నమ్మశక్యం కాని రీతిలో ఓ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టింది. ప్రియా మిశ్రా బౌలింగ్‌లో బ్రూక్‌ హ్యాలీడే ఆడిన షాట్‌ను రాధా యాదవ్‌ పక్షిలా గాల్లోకి ఎగిరి ఒడిసిపట్టుకుంది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. నెటిజన్లు ఈ క్యాచ్‌ను గతంలో యువరాజ్‌ సింగ్‌ పట్టిన ఓ సెన్సేషన్‌ క్యాచ్‌తో పోలుస్తున్నారు.

కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. 41 ఓవర్ల అనంతరం ఆ జట్టు స్కోర్‌ 191/4గా ఉంది. సుజీ బేట్స్‌ (58), జార్జియా ప్లిమ్మర్‌ (41), లారెన్‌ డౌన్‌ (3), బ్రూక్‌ హ్యాలీడే (8) ఔట్‌ కాగా.. సోఫీ డివైన్‌ (60), మ్యాడీ గ్రీన్‌ (19) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో దీప్తి​ శర్మ, ప్రియా మిశ్రా, రాధా యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచిన న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. 

చదవండి: ఎల్లిస్‌ పెర్రీ ఊచకోత.. సిడ్నీ సిక్సర్స్‌ బోణీ విజయం

Videos

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

Photos

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)